IPL Auction: భువీ కోసం ఆ మూడు జట్ల మధ్య పోటీ ఖాయం..
2025 ఐపీఎల్ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) భువనేశ్వర్ కుమార్‌ను విడుదల చేసింది, కానీ అనుభవం, సామర్థ్యం ఉన్నందున పలు జట్లు అతడిని దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ముంబై ఇండియన్స్ (MI) జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా భువీని తీసుకునే అవకాముంది, గుజరాత్ టైటాన్స్ (GT) పేస్ విభాగంలో అనుభవం ఉన్న బలర్ కోసం చూస్తోంది, కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) తమ పవర్‌ప్లే బౌలింగ్‌ను బలోపేతం చేయడానికి భువీని టార్గెట్ చేయవచ్చు.
భువనేశ్వర్ కుమార్‌ను 2025 ఐపీఎల్ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విడుదల చేసింది. 2014 నుండి SRH జట్టులో ఉన్న భువీ గత కొద్ది కాలంగా స్థాయికి దగ్గట్లుగా రాణించడంలేదు. ఒకసారి లయదొరకబుచ్చుకుంటే భువీని ఆపడం ఎవరి తరం కాదు. ఐపీఎల్ ఎక్కువగా పేరుగాంచిన జాబితాలో భువి పేరు మొదటి వరుసలో ఉంటుంది. భువీ అనుభవం, సామర్థ్యం దృష్ట్యా కొన్ని జట్లు అతడిని మెగా వేలంలో దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. 2025 ఐపీఎల్ వేలంలో భువనేశ్వర్‌ను పలు జట్లు కోరుకుంటాయని అంచనా వేస్తున్నారు, అందులో ప్రధానంగా మూడు జట్లు ఉన్నాయి.
ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ (MI) భువనేశ్వర్ కోసం ముందుగా వేలంలో పోటీ పడే జట్లలో ఒకటిగా చెప్పవచ్చు. MI కి జస్ప్రీత్ బుమ్రాకు సరైన భాగస్వామిని తీసుకురావడం కోసం ఇబ్బందులు పడుతోంది. భువనేశ్వర్ భారత జట్టులో బుమ్రాతో కలిసి ఆడిన అనుభవం ఉంది. అంతేకాదు వాంఖడే మైదానంలో భువీకి మంచి పట్టు కూడా ఉంది. పేస్ విభాగంలో అనుభవం ఉన్న ఆటగాళ్ల కోసం MI ఎప్పుడు కోరుకుంటుంది. అందులో భువనేశ్వర్ సరిగ్గా సరిపోతాడు.
గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ (GT) అనుభవం ఉన్న భారత బౌలర్లలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ప్రాంచైజీ గా పేరు ఉంది. ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మను కొనుగోలు చేసిన గుజరాత్ అనుభవజ్ఞుడయిన భువనేశ్వర్ కోసం ప్రయత్నించవచ్చు. అహ్మదాబాద్‌లో కొత్త బంతితో స్వింగ్ పొందే అవకాశం ఉంటుందని, అలాగే డెత్ ఓవర్లలో కూడా భువీ జట్టుకు ఉపయోగపడుతాడని అందిస్తాడని GT భావిస్తోంది. గుజరాత్ కి మహ్మద్ షామి లభించకపోతే, భువనేశ్వర్‌ను మళ్లీ ప్రయత్నించే అవకాశం ఉంది.
కొల్కతా నైట్ రైడర్స్
కొల్కతా నైట్ రైడర్స్ (KKR) మిచెల్ స్టార్క్ మరియు వైభవ్ అరోరా వంటి కొత్త బంతి స్పెషలిస్టులను విడుదల చేసింది. అందుకే పవర్‌ప్లే స్పెషలిస్టులు తప్పనిసరిగా అవసరం, మధ్యలో హర్షిత్ రాణాకు సహాయం చేసేందుకు వీలుగా ఉండాలి. భువనేశ్వర్ పవర్‌ప్లే మరియు డెత్ ఓవర్లలో కూడా హర్షిత్ రాణాతో కలిసి బౌలింగ్ చేయగలడు, KKR విదేశీ ఆటగాళ్లను ఇతర కీలక పాత్రలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. గత సీజన్లతో పోలిస్తే భువనేశ్వర్ ధర తక్కువగా ఉండవచ్చు, కనుక KKR బడ్జెట్‌లో సరిపోతాడని భావిస్తున్నారు.