AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy Controversy: ICC ముందు మూడు ఆఫ్సన్స్..

2024 ఛాంపియన్స్ ట్రోఫీపై ఐసీసీకి తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయి, ఎందుకంటే BCCI పాకిస్థాన్‌కు తమ జట్టును పంపేందుకు నిరాకరించింది. పిసిబి హైబ్రిడ్ మోడల్‌కి నిరాకరిస్తోంది. దీంతో ఐసీసీ మూడు పరిష్కారాలను మార్గాలను పరిశీలిస్తోంది. అయితే ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Champions Trophy Controversy: ICC ముందు మూడు ఆఫ్సన్స్..
Icc Champions Trophy
Narsimha
|

Updated on: Nov 14, 2024 | 9:40 PM

Share

వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే పాకిస్థాన్‌కు తమ జట్టును పంపేందుకు నిరాకరించడంతో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పిసిబికి ఈ ఈవెంట్ కోసం చట్టపరమైన హోస్టింగ్ హక్కులు ఉన్నప్పటికీ, గతంలో తీసుకున్న హైబ్రిడ్ సిస్టమ్ ఆమోదించడాన్ని వారు ఇష్టపడలేదు. పిసిబి లేదా బిసిసిఐ తమ ప్రస్తుత వైఖరి మార్చుకోవడం లేదు. దీంతో సమస్యను పరిష్కరించే బాధ్యత ఐసిసి భుజాలపై పడింది.

ప్రస్తుతం, ICCకి మూడు ఆఫ్సన్స్ మాత్రమే ఉన్నాయి.

  1. BCCI ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించడానికి PCBని ఒప్పించడం, మొత్తం 15 మ్యాచుల్లో 5 మ్యాచులు UAEలో నిర్వహించడం.
  2. ఛాంపియన్స్ ట్రోఫీని నుండి పాకిస్తాన్ టీమ్ ని తొలగించడం. అయితే ఇది PCB తమ జట్టును టోర్నమెంట్ నుండి పూర్తిగా ఉపసంహరించుకుంటేనే సాధ్యం అవుతుంది.
  3. ఛాంపియన్స్ ట్రోఫీని నిరవధికంగా వాయిదా వేయడం, ఇది ICC తో పాటు PCB ఆదాయాలను ప్రభావితం చేయవచ్చు, ఎందుకంటే వారు ఈ టోర్నమెంట్ ద్వారా భారీగా ఆదాయం పొందాలని ఆశిస్తున్నారు.

పాకిస్థాన్ గతంలో అనేక సంధర్భాల్లో ప్రపంచంలోని ప్రముఖ జట్లకు ఆతిథ్యం ఇచ్చింది. న్యూజిలాండ్ మూడు సార్లు, ఇంగ్లండ్ రెండు సార్లు, ఆస్ట్రేలియా ఒకసారి పాకిస్థాన్‌లో పర్యటించాయి.

భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు BCCI నిరాకరించడం పై PCB ఐసీసీకి వివరణ కోరింది. పిసిబి ప్రతినిధి సమీ-ఉల్-హసన్ మాట్లాడుతూ, “ICC లేఖపై పిసిబి గత వారం స్పందించింది, వారు BCCI నిర్ణయంపై వివరణ కోరారు” అని తెలిపారు. ఈ సంక్షోభానికి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు ICC కృషి చేయాలని క్రికెట్ ఫ్యాన్ కోరుకుంటున్నారు.