AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Border–Gavaskar Trophy: కింగ్ డమ్ లోకి కింగ్ తిరిగొచ్చాడు.. టీమిండియా మాజీ కోచ్ హెచ్చరిక!

విరాట్ కోహ్లి ఆస్రేలియాలో తిరిగి తన ఉత్తమ ఫామ్‌ను కనబరిచే అవకాశం ఉందని రవి శాస్త్రీ అభిప్రాయపడ్డారు, ఇటీవల ఫామ్ లో లేకున్నా. కోహ్లి మొదటి కొన్ని ఓవర్లలో శాంతంగా ఆడాలని సలహా ఇచ్చారు. కోహ్లి ఆస్రేలియాలో ఆడిన 13 టెస్టుల్లో 6 సెంచరీలు సాధించి అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు.

Border–Gavaskar Trophy: కింగ్ డమ్ లోకి కింగ్ తిరిగొచ్చాడు.. టీమిండియా మాజీ కోచ్ హెచ్చరిక!
Ahead Of Border Gavaskar Trophy Virat Kohli
Narsimha
|

Updated on: Nov 15, 2024 | 10:36 AM

Share

భారత మాజీ కోచ్ రవి శాస్త్రీ, విరాట్ కోహ్లి గురించి ఆశక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఫామ్ పట్ల విమర్శలు ఎదురవుతున్నప్పటికీ, అతడు తనకు ఇష్టమైన ఆస్రేలియాలో తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడం ఖాయమన్నారు. ప్రస్తుతం కోహ్లి సరిగ్గా ఫామ్‌లో లేకపోయినా, ఆస్రేలియా గ్రౌండ్స్‌లో అతడు మునపటి ఫామ్ ను అందిపుచ్చుకోవడం పక్కా అని పేర్కొన్నారు.

ICC రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్న రవిశాస్త్రీ “రాజు తన రాజ్యంలోకి తిరిగి వచ్చాడు. దాన్ని నేను చాలా నమ్మకంగా చెప్పగలను”  అని పేర్కొన్నాడు. కోహ్లి ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఎంతో సక్సెస్ సాధించినట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో కోహ్లి ఇన్నింగ్స్‌కు 50 పైగా పరుగుల సగటు సాధించటంతో పాటు ఆ దేశంలో ఆరు సెంచరీలు నమోదు చేశాడు.

కోహ్లి కెరీర్ పై ప్రశ్నలు

విరాట్ కోహ్లి ఇటీవలి కాలంలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో తన బ్యాటింగ్ ఫామ్‌ను కోల్పోయాడు. ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లో అతడు కేవలం 93 పరుగులే సాధించగా, 2024లో అతడు ఆడిన 6 టెస్టుల్లో 250 పరుగులు మాత్రమే చేసారు. వీటిలో ఒక సెంచరీ కూడా లేకపోవడం గమన్హారం. “ఆస్రేలియాలో కోహ్లి తనకు వచ్చిన పేరు గురించి చెప్పడం చాలా తేలికగా ఉంటుంది. కాని అక్కడ కోహ్లీ సాధించినది చాలా అరుదుగా జరుగుతుందన్నాడు.

 కోహ్లి కి శాస్త్రీ సలహా

విరాట్ కోహ్లీకి రవిశాస్త్రీ ఓ సలహా ఇచ్చాడు. అతను న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో హడావిడిగా ఆడి ఔటయ్యాడు. ఫుల్-టాస్‌ బంతులకు అవుట్ అవ్వడమే కాకుండా కీలక సమయాల్లో రనౌట్ అయ్యాడు. కోహ్లి ముందుగా ఎక్కువ ఆందోళన లేకుండా స్థిరంగా ఆడితే, అతడు తిరిగి తన ఫామ్ లోకి రాగలడని శాస్త్రీ అభిప్రాయపడ్డారు. తొలి 30 నిమిషాల్లో ప్రశాంతంగా ఆడితే కోహ్లీ పుంజుకుంటాడు అని శాస్త్రీ సూచించారు.

ఆస్రేలియాలో విరాట్ కోహ్లి రికార్డులు

2012లో అడిలైడ్ టెస్టులో విరాట్ కోహ్లి తన తొలి సెంచరీని సాధించారు. 2014లో, కోహ్లి ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు సాధించి అతనిలోని అసాధారణమైన బ్యాటింగ్ ప్రదర్శనను చూపించాడు. 2018-19లో కోహ్లి భారత్‌కు తొలిసారి టెస్టు సిరీస్ విజయం అందించారు. ఆ సమయంలో, పెర్త్ లో కోహ్లి ఒక అద్భుతమైన సెంచరీ (123 పరుగులు) చేసి, అత్యంత ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియాలో కోహ్లి రికార్డులు గమనిస్తే ఖచ్చితంగా కోహ్లీ మరోసారి చెలరేగడానికి సిద్దంగా ఉన్నాడని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు