IPL 2025: అసలు మనం SRHకి ఎందుకు సపోర్ట్ చేయాలి? ప్రతి తెలుగోడు తెలుసుకోవాల్సిన విషయం
ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మద్దతు ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ వ్యాసం వివరిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి జట్టు ఇది. నితీష్ రెడ్డి, ఇషాన్ కిషన్ లాంటి తెలుగు ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మన రాష్ట్రాలకు చెందిన జట్టుకు మద్దతు ఇవ్వడం గర్వకారణం. ఇతర జట్లకు మద్దతు ఇవ్వడం కంటే మన జట్టును ప్రోత్సహించడం మంచిది.

ఐపీఎల్ 18వ సీజన్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మన హోం టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లంతా ఉప్పల్ స్టేడియానికి చేరుకొని బాల్‌ను తుప్పల్లోకి కొట్టేందుకు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే ఐపీఎల్‌లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్ ఏది అంటే ఆర్సీబీ అని అంటారు. అలాగే సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌కు కూడా మంచి క్రేజ్ ఉంది. చాలా వరకు ఏ స్టేట్ వాళ్లు వాళ్ల టీమ్‌ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. కోహ్లీ కోసమో, ధోని కోసమో, రోహిత్ కోసమో వాళ్ల సొంత టీమ్‌కు కాకుండా ఆర్సీబీ, సీఎస్‌కే, ఎంఐకి సపోర్ట్ చేస్తారు. కానీ, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఈ మూడు టీమ్స్‌ను ఎక్కువ అభిమానిస్తారని సర్వేలు చెబుతున్నాయి. అందుకు కారణం కోహ్లీ, ధోని, రోహిత్ అయి ఉండొచ్చు.
బట్.. మన హోం టీమ్ ఎస్‌ఆర్‌హెచ్‌ను మించి ఆయా టీమ్స్‌ను సపోర్ట్ చేసే వాళ్లు పెరిగిపోతున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ సపోర్టుల సంఖ్య బాగానే ఉన్నా.. కొంతమంది మాత్రం అసలు మనం ఎస్‌ఆర్‌హెచ్‌కి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఓనర్లు మనవాళ్లు కాదు కదా? మన ఇండియా ప్లేయర్లు, తెలుగు క్రికెటర్లు ఎవరున్నారని టీమ్‌లో? పైగా కొంతమంది ఆంధ్రా వాళ్లు కూడా అది తెలంగాణ టీమ్ అంటూ దూరం పెడుతున్నారు. ఇలాంటి వాళ్లలకు ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ వింధ్య మంచి సమాధానం ఇచ్చారు. నిజానికి ఆమె చెప్పింది ప్రతి తెలుగోడు తెలుసుకోవాల్సిన విషయం. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే.. ఒక్క సీఎస్‌కే టీమ్ కాకుండా మిగతా అన్ని టీమ్స్‌కు ఓవర్స్ ఆ స్టేట్ వాళ్లు కాదు, సో సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ మన స్టేట్ కాదని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
సెకండ్ పాయింట్ తెలుగు క్రికెటర్లు, టీమిండియా ఆటగాళ్లు లేరని అనేవాళ్లకు నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ రూపంలో ఆన్సర్ దొరికేసింది. ఇక తెలంగాణ టీమ్ అనేందుకు లేదు. సన్‌రైజర్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీమ్. ఎందుకంటే.. ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్‌లోకి 2013లోనే ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా విడిపోలేదు. సో.. ఇది మన ఉమ్మడి టీమ్. అందుకే సన్‌రైజర్స్ తెలంగాణ అని కాకుండా.. అప్పటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పేరు పెట్టారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అని. సో ఎస్‌ఆర్‌హెచ్ తెలుగు వాళ్ల టీమ్. ఈ సీజన్‌లో మనమంతా మన హోం టీమ్ సన్‌రైజర్స్‌కే సపోర్ట్ చేద్దాం.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..