IPL 2025: ఓర్నీ బండబడ.! కావ్య పాపనే పరేషాన్ చేస్తోన్న ఆ ముగ్గురు ప్లేయర్స్.. ఎవరంటే.?
కావ్య మారన్ ను పరేషాన్ చేస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ కీ ప్లేయర్స్. వారి పేలవ ఫామ్ కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ ముందుగానే SRH టీం సతమతమవుతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి.

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 ఆరంభం కానుంది. మార్చి 22 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇదిలా ఉండగా.. గత సీజన్‌లో ఒక్క అడుగు దూరంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ట్రోఫీని మిస్ చేసుకుంది. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలం ముందుగా కీలక ప్లేయర్స్ అయిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్‌ను అట్టిపెట్టుకుంది. పూర్తిగా బ్యాటింగ్‌పై ఆధారపడిన SRH.. మెగా వేలంలో కీలకమైన బౌలర్లను కొనుగోలు చేసింది. ఇదంతా అటుంచితే.. ఐపీఎల్ 2025 సీజన్ స్టార్ట్ కాకముందే SRH జట్టు ఓనర్ కావ్య మారన్‌ను పరేషాన్ చేస్తున్నారు ఓ ముగ్గురు ప్లేయర్స్. ఆ జట్టు ముగ్గురు కీలక ప్లేయర్స్ ఫామ్‌లో లేకపోవడమే ఇందుకు కారణం. వారెవరో కాదు కమిందు మెండీస్, జయదేవ్ ఉనద్కట్, ఇషాన్ కిషన్
కమిందు మెండీస్ తన చివరి మూడు మ్యాచ్‌లలో కేవలం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అటు 34 ఏళ్ల జయదేవ్ ఉనద్కట్ పేస్ బౌలింగ్‌లో అంత పదును కనిపించడం లేదు. ప్రధాన బౌలర్లైన షమీ, హర్షల్ పటేల్, కమిన్స్‌లో ఎవరైనా గాయంతో వైదొలిగితే.. కచ్చితంగా ఉనద్కట్ బ్యాకప్ ఆప్షన్ అవుతాడు. అయితే అతడు ప్రస్తుతం సరైన ఫామ్‌లో లేడు. ఇక ఇషాన్ కిషన్ ఫామ్ కూడా అనుకున్నంతగా లేదు. దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ చివరి 10 మ్యాచ్‌లలో 134 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇంట్రా డే మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ అదరగొడుతున్నాడు. ఇదే ఫామ్ ప్రధాన మ్యాచ్‌లలోనూ కంటిన్యూ చేస్తే SRHకి తిరుగుండదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..