IPL 2025: అందరూ పవర్ హిట్టింగ్ మాన్‌స్టర్‌లే.. వామ్మో.! ఈ ముగ్గురి బ్యాటింగ్‌కు మ్యాడైపోవాల్సిందే
ఎవ్వరికీ వాళ్లు తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ స్టార్ట్ కాగానే.. తమ ప్రతాపం చూపించేందుకు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ లైనప్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది. ఈ ముగ్గురు బరిలోకి దిగారంటే.. ఇక ప్రత్యర్ధులు వణికి పోవాల్సిందే..

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే అన్ని జట్లు తమ బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే IPL 2025 కోసం అన్ని జట్ల ఆటగాళ్లు పూర్తి స్థాయి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. టోర్నమెంట్‌కు ముందు ప్రతీ జట్టు ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ మరోసారి తమ హార్డ్ హిట్టింగ్‌తో వార్తల్లో నిలిచారు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ రెండు జట్ల మధ్య మార్చి 23న మ్యాచ్ జరగనుంది. ఈలోపే రాయల్స్ ముగ్గురు ఆటగాళ్లు తమ పవర్ హిట్టింగ్‌తో హైదరాబాద్ జట్టులో హెచ్చరికలు జారీ చేశారు.
144* (64) – What a Riyan yaar 🔥💗 pic.twitter.com/K6Ht3wRFQE
ఇవి కూడా చదవండి— Rajasthan Royals (@rajasthanroyals) March 19, 2025
ముగ్గురు కలిసి 331 పరుగులు..
ఇతర జట్ల మాదిరిగానే, రాజస్థాన్ రాయల్స్ కూడా తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. ఈ సమయంలో ఆ జట్టులోని యువ త్రయం యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ కలిసి 331 పరుగులు చేశారు. సిక్సర్లు, ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పరాగ్ కేవలం 64 బంతుల్లో 144 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. ఈ తరుణంలో అతడి బ్యాట్ నుంచి 16 ఫోర్లు, 10 సిక్సర్లు వచ్చాయి. అంటే దాదాపుగా బౌండరీల రూపంలోనే 124 పరుగులు చేశాడు. అలాగే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా తన హిట్టింగ్‌తో 34 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ధృవ్ జురెల్ కూడా బ్యాట్‌తో దుమ్ములేపాడు. కేవలం 44 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు.
గత సీజన్‌లో ప్రదర్శన ఇలా..
గత ఐపీఎల్ సీజన్‌లో రియాన్ పరాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. IPL 2024లో అతడు 16 మ్యాచ్‌ల్లో 52 కంటే ఎక్కువ సగటుతో 573 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడు 4 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. స్ట్రైక్ రేట్ దాదాపుగా 150 ఉంది. ఇది కాకుండా.. బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇక జైస్వాల్ 16 మ్యాచ్‌ల్లో 31 సగటుతో 435 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీ ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 155.91గా ఉంది. ధృవ్ జురెల్ గత సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 24.38 సగటుతో, 138.30 స్ట్రైక్ రేట్‌తో 195 పరుగులు చేశాడు.
Aaj mahol pura 🥶🔥 pic.twitter.com/x8ytQSld4m
— Rajasthan Royals (@rajasthanroyals) March 19, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..