RCB vs SRH, IPL 2024: హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు
Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. బెంగళూరు బౌలర్లను చితక బాదుతూ తమ రికార్డును తామే బ్రేక్ చేసుకున్నారు. సోమవారం (ఏప్రిల్ 15) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి..
Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. బెంగళూరు బౌలర్లను చితక బాదుతూ తమ రికార్డును తామే బ్రేక్ చేసుకున్నారు. సోమవారం (ఏప్రిల్ 15) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102, 9 ఫోర్లు, 8 సిక్సర్లు), క్లాసెన్(31 బంతుల్లో 67, 2 ఫోర్లు, 7 సిక్స్ లు), అభిషేక్ శర్మ(34), మార్‌క్రమ్(17 బంతుల్లో 32 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అబ్దుల్ సమద్( 10 బంతుల్లో 37 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది హైదరాబాద్. ఈ సీజన్‌లోనే కొన్ని రోజుల క్రితం ముంబయిపై హైదరాబాద్ 277/3 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. బెంగళూరు బౌలర్లలో ఫెర్గుసన్ 2, టాప్లే ఒక వికెట్ పడగొట్టారు.
బాదుడే బాదుడు..
Travis Head 🙌
From playing for RCB ➡️ Scoring 💯 against RCB #RCBvSRH #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/1TDKCVU4Cj
— JioCinema (@JioCinema) April 15, 2024
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్:
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమరోర్, విజయ్‌కుమార్ వైషాక్, రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
సుయాష్ ప్రభుదేసాయి, అనుజ్ రావత్, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, టి నటరాజన్.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి
Got an update from #Chandrayaan, the ball is still travelling at the speed of light 😉#TATAIPL #RCBvSRH #IPLonJioCinema #HeinrichKlaasen #IPLinTelugu pic.twitter.com/fmVeijmSlk
— JioCinema (@JioCinema) April 15, 2024
Head-ing towards another classic Bengaluru run-fest 🔥#TATAIPL #RCBvSRH #IPLonJioCinema #IPLinTelugu | @SunRisers pic.twitter.com/Y6FgzZRlm9
— JioCinema (@JioCinema) April 15, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..