AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Tickets: ఫ్యాన్స్‌కు మళ్లీ బ్యాడ్ న్యూస్.. బెంగళూరు, హైదరాబాద్ మ్యాచ్ టికెట్స్ క్షణాల్లో సోల్డ్ ఔట్

SRH vs RCB Tickets: ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ క్రికెట్ అభిమానులను ఓ రేంజ్ లో అలరిస్తోంది. గత సీజన్ల కంటే ఈ సీజన్ లో హై ఓల్టేజ్ మ్యాచ్ లు వీక్షించేందుకు వేదికానుండటంతో మరింత ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ధోని, కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్లు ఆయా జట్లను వెనుకఉండి లీడ్ చేస్తున్నారు.

IPL Tickets: ఫ్యాన్స్‌కు మళ్లీ బ్యాడ్ న్యూస్.. బెంగళూరు, హైదరాబాద్ మ్యాచ్ టికెట్స్ క్షణాల్లో సోల్డ్ ఔట్
Uppal Stadium
Balu Jajala
| Edited By: |

Updated on: Apr 12, 2024 | 5:34 PM

Share

ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ క్రికెట్ అభిమానులను ఓ రేంజ్ లో అలరిస్తోంది. గత సీజన్ల కంటే ఈ సీజన్ లో హై ఓల్టేజ్ మ్యాచ్ లు వీక్షించేందుకు వేదికానుండటంతో మరింత ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ధోని, కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్లు ఆయా జట్లను వెనుకఉండి లీడ్ చేస్తున్నారు. ఈ స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ ను చూసేందుకు అభిమానులు ఎక్కవగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ను డైరెక్ట్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఉన్నప్పటికీ టికెట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.

ఇటీవలనే చెన్నై, హైదరాబాద్ ను మ్యాచ్ నుచూసేందుకు అభిమానులు టికెట్ల వెళ్లగా నిరాశగా తిరిగి వచ్చారు. ఆన్ లైన్ లోపెట్టిన టికెట్లు కొద్ది నిమిషాలకే ఖాళీ అవుతండటంతో అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈనెల 25న బెంగళూరు తో ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. అయితే ఉదయం టికెట్లను విక్రయానికి పెట్టిన పేటీఎం.. ఐదు నిమిషాల్లోనే టికెట్లు అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. ప్రతి మ్యాచ్ కు ముందు నిర్వాహకులు ఇదే వైఖరి కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఇక టికెట్లు దొరక్కా బ్లాక్ లోనే కొనుక్కుంటున్నారు అధిక డబ్బు  కొందరు అభిమానులు. టికెట్ దొరకని అభిమానులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. హెచ్సీఏ కాంప్లిమెంటరీ పాసులు దుర్వినియోం అవుతున్నాయని, కాంప్లిమెంటరీ పాసులను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని అభిమానులు ఫైర్ అవుతున్నారు.