IPL 2024: ఒకటి కాదు, రెండు కాదు.. బెంగళూరు రికార్డును ఏకంగా 3 సార్లు బ్రేక్ చేసిన హైదరాబాద్.. అదేంటంటే?
2023 వరకు ఓ లెక్క. ఇప్పటి నుంచి ఓ లెక్క... ప్రస్తుత సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టు ప్రదర్శన చూస్తే ఈ డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా ఐపీఎల్ అత్యుత్తమ రికార్డుగా గుర్తింపు పొందిన రికార్డును SRH జట్టు మూడు సార్లు బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ చేసింది. అవును.. 2013లో పుణె వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్ (175) సెంచరీతో ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.
2023 వరకు ఓ లెక్క. ఇప్పటి నుంచి ఓ లెక్క… ప్రస్తుత సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టు ప్రదర్శన చూస్తే ఈ డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా ఐపీఎల్ అత్యుత్తమ రికార్డుగా గుర్తింపు పొందిన రికార్డును SRH జట్టు మూడు సార్లు బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ చేసింది. అవును.. 2013లో పుణె వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్ (175) సెంచరీతో ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఇంతటి గొప్ప రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని అన్నారు. ఈ ప్రకారం, గత 10 ఏళ్లలో, ఏ జట్టు కూడా ఈ రికార్డుకు చేరువ కాలేదు.
కానీ, ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లెక్కలన్నీ తలకిందులు చేసింది. RCB చేసిన ఫీట్‌ను ఒకే సీజన్‌లో మూడుసార్లు ఈ రికార్డును బద్దలు కొట్టింది. దీంతో ఆర్సీబీ జట్టు రికార్డును ఐదో స్థానానికి నెట్టింది.
ఈసారి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై 272 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆర్సీబీపై 287 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266 పరుగులతో మరోసారి రెచ్చిపోయింది.
దీంతో RCB జట్టు ఒకే సీజన్‌లో మూడుసార్లు 263+ పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టింది. అలాగే, ఐపీఎల్‌లో అత్యధిక స్కోరింగ్ చేసిన జట్ల జాబితాలో SRH మొదటి రెండు స్థానాలను ఆక్రమించింది.
కేకేఆర్ (272 స్కోరు) మూడో స్థానంలో ఉండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. అలాగే ఇప్పుడు RCB జట్టు స్కోరు 263 పరుగుల రికార్డు ఐదో స్థానానికి నెట్టింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:
పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐదాన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆకాష్ మహరాజ్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్.
ఢిల్లీ ప్లేయింగ్ XI:
రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఎన్రిక్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
పృథ్వీ షా, షాయ్ హోప్, ప్రవీణ్ దూబే, రసిఖ్ దార్ సలామ్, సుమిత్ కుమార్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..