IPL 2024: ట్రావిస్ హెడ్ దెబ్బకు.. సురేశ్ రైనా రికార్డ్ జస్ట్ మిస్.. అదేంటంటే?
Travis Head Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 35వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ 32 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 11 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. ఈ 89 పరుగులలో కేవలం 4 పరుగుల తేడాతో సురేష్ రైనా రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని హెడ్ కోల్పోయాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) చరిత్రలో, పవర్‌ప్లేలో మొదటి మూడు ఓవర్లలో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే అర్ధ సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ (13 బంతుల్లో) అగ్రస్థానంలో ఉండగా, కేఎల్ రాహుల్ (14 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్ మూడో స్థానంలో నిలిచాడు.
అలాగే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ప్లే ముగిసే సమయానికి ట్రావిస్ హెడ్ 26 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్‌లో పవర్‌ప్లే ఆల్-టైమ్ రికార్డ్‌ను హెడ్ బ్రేక్ చేయలేకపోయాడు.
అవును, సురేష్ రైనా IPL చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. 2014లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే తరుపున రెచ్చిపోయిన రైనా.. కేవలం 25 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు.
10 ఏళ్ల తర్వాత ట్రావిస్ హెడ్‌కి ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. కానీ, పవర్‌ప్లే చివరి ఓవర్ 5వ బంతికి ట్రావిస్ హెడ్ ఎలాంటి పరుగులు చేయకుండానే ఈ అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
అయితే, ఐపీఎల్‌లో తొలి 6 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాట్స్‌మెన్, 2వ ఆటగాడిగా ట్రావిస్ హెడ్ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుల ద్వారా హెడ్ ఈ ఐపీఎల్‌లో తన మాస్టర్‌స్ట్రోక్‌ను కొనసాగించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..