AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ఢిల్లీపై రికార్డ్ విజయంతో చెన్నైకి బిగ్ షాకిచ్చిన హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో కీలక మార్పులు?

IPL 2024 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 35 మ్యాచ్‌ల సమయానికి పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పు వచ్చింది. అంతకుముందు ఐదో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఇప్పుడు అద్భుత విజయంతో రెండో స్థానానికి చేరుకుంది. ఆర్సీబీ ఇప్పటికీ చివరి స్థానంలోనే ఉంది. వరుస పరాజయాలతో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ రేసుకు దూరంగా వెళ్తుంది.

IPL 2024: ఢిల్లీపై రికార్డ్ విజయంతో చెన్నైకి బిగ్ షాకిచ్చిన హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో కీలక మార్పులు?
Ipl 2024 Points Table
Venkata Chari
|

Updated on: Apr 21, 2024 | 11:27 AM

Share

IPL 2024 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్-17లో 35 మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. మొదటి అర్ధభాగంలో, RR 6 విజయాలు నమోదు చేయగా, SRH 5 విజయాలు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలను ఆక్రమించింది. దీని ప్రకారం ఐపీఎల్ కొత్త పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఓసారి చూద్దాం..

రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 మ్యాచ్‌లు గెలిచింది. మొత్తం 12 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ +0.677.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. SRH జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ +0.914.

ఇవి కూడా చదవండి

కోల్‌కతా నైట్ రైడర్స్ 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి మొత్తం 8 పాయింట్లు సాధించింది. +1.399 నెట్ రన్ రేట్ కలిగి ఉండటం ద్వారా మూడవ స్థానంలో కూడా కనిపించింది.

7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 3 ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. మొత్తం 8 పాయింట్లతో CSK జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ +0.529గా నిలిచింది.

పాయింట్ల పట్టికలో లక్నో సూపర్‌జెయింట్‌ 5వ స్థానంలో ఉంది. LSG ఆడిన 7 మ్యాచ్‌లలో 4 గెలిచింది. మొత్తం 8 పాయింట్లతో నికర రన్ రేట్ +0.123గా నిలిచింది.

7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ముంబై ఇండియన్స్ జట్టు 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు నెట్ రన్ రేట్ -0.133గా నిలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 పాయింట్లు -0.477 నెట్ రన్ రేట్‌తో సాధించింది. దీంతో ఇప్పుడు ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో నిలిచింది.

7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు నమోదు చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 6 పాయింట్లతో 8వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టు నెట్ రన్ రేట్ -1.303గా నిలిచింది.

పంజాబ్ కింగ్స్ జట్టు 7 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ -0.133గా నిలిచింది.

RCB జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 10వ స్థానానికి పడిపోయింది. RCB జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ -1.185గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
హోం లోన్ తీసుకున్న వారికి EMI ఎంత పెరగనుంది?
హోం లోన్ తీసుకున్న వారికి EMI ఎంత పెరగనుంది?