KKR vs SRH Qualifier 1: హైదరాబాద్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధమైన కోల్‌కతా.. ప్లేయింగ్ 11లోకి తుఫాన్ ప్లేయర్ ఆగయా..
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Qualifier 1: ఫైనల్ మ్యాచ్ కోసం మాత్రమే రిజర్వ్ డే ఉంది. ఫైనల్ మినహా, ప్లేఆఫ్‌లోని ఏ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే.. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ ఉంటుంది. ఐదు ఓవర్ల మ్యాచ్ సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం నిర్ణయించబడుతుంది. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా జరగని పరిస్థితి ఏర్పడితే పాయింట్ల పట్టికలో స్థానం/ర్యాంకింగ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Qualifier 1: ఐపీఎల్ 2024 మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మంగళవారం, మే 21 న జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో KKR ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..
ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు..
ఫైనల్ మ్యాచ్ కోసం మాత్రమే రిజర్వ్ డే ఉంది. ఫైనల్ మినహా, ప్లేఆఫ్‌లోని ఏ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే.. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ ఉంటుంది. ఐదు ఓవర్ల మ్యాచ్ సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం నిర్ణయించబడుతుంది. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా జరగని పరిస్థితి ఏర్పడితే పాయింట్ల పట్టికలో స్థానం/ర్యాంకింగ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.
ఫిల్ సాల్ట్‌ను భర్తీ చేయనున్న మరో తుఫాన్ ప్లేయర్..
తుఫాన్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లాడు. ఈ మ్యాచ్‌లో KKR అతనిని తప్పకుండా కోల్పోతుంది. అయితే, కోల్‌కతా అతని స్థానంలో మరో తుఫాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్‌ను రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. గుర్బాజ్, సునీల్ నరైన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించగలరని తెలుస్తోంది.
ఆ తర్వాత నితీష్ రానా మూడో స్థానంలో, శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో, వెంకటేష్ అయ్యర్ ఐదో స్థానంలో, ఆండ్రీ రస్సెల్ ఆరో స్థానంలో, రింకు సింగ్ ఏడవ స్థానంలో, రమణదీప్ సింగ్ ఎనిమిదో స్థానంలో ఆడగలరు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కనిపించనున్నారు. KKR తన బ్యాటింగ్‌లో చాలా లోతును కలిగి ఉంది. ఇది ఈ జట్టుకు అతిపెద్ద బలం.
క్వాలిఫయర్ మ్యాచ్‌లో KKR ప్రాబబుల్ ప్లేయింగ్ XI- రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..