హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్‌కు చుక్కెదురు అయింది. ఫార్ములా రేసు కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం. 409 సెక్షన్ ఈ కేసులో వర్తించదని.. 13(1)(a) సెక్షన్ వర్తించదంటూ కేటీఆర్ లాయర్లు కోర్టులో వాదించారు. అయితే అటు ఏసీబీ, ఇటు కేటీఆర్ లాయర్ల వాదనలు విన్న కోర్టు.. చివరికి ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది.
ఫార్ములా-E రేస్ కేస్‌లో KTRకు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఇవాళ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తుది తీర్పును ఇచ్చింది. వాదనల సమయంలో నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఇలాంటి పిటిషన్లు కుదరదని తేల్చి చెప్పింది కోర్టు. అలాగే ఫార్ములా E-రేస్‌లో నిధుల దుర్వినియోగం లేదని KTR తరపు లాయర్లు వాదించగా.. మనీ ట్రాన్స్‌ఫర్ ఫైల్‌పై కేటీఆర్ సంతకం చేశారని ACB చెప్పుకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు నేరపూరిత కూట్రేని ఏసీబీ అడ్వొకేట్లు కోర్టులో తమ వాదనలను గట్టిగా వినిపించారు. అటు 409 సెక్షన్ వర్తించదని కేటీఆర్ తరపు లాయర్లు చేసిన వాదన.. సరికాదని ఏసీబీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. చివరికి ఏసీబీ వాదనలు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసింది.
మరోవైపు హైకోర్టు తీర్పు రాగానే ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ-రేస్ కేసులో పలుచోట్ల సోదాలు నిర్వహిస్తోంది. రెండు కంపెనీలకు సంబంధించిన రికార్డులను హైదరాబాద్, విజయవాడలోనూ పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి