AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతు భరోసాపై మరింత క్లారిటీ.. ఆ భూములకు కూడా సాయం..!

అన్నదాతలకు రైతుభరోసా పథకంతో పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. జనవరి 26వ గణతంత్ర దినోత్సవం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. దీంతో అవసరమైన కార్యాచరణను రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గ్రామ సభల్లో రైతుభరోసా లబ్ధిదారులు, సాగు భూముల వివరాలు తెలుసుకోనుంది సర్కార్.

Telangana: రైతు భరోసాపై మరింత క్లారిటీ.. ఆ భూములకు కూడా సాయం..!
Rythu Bharosa Scheme
Ram Naramaneni
|

Updated on: Jan 08, 2025 | 10:18 AM

Share

జనవరి 26 గణతంత్ర దినోత్సవం మాత్రమే కాదు.. తెలంగాణలో రైతులందరికీ భరోసా నిధులు అందే పండగరోజు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై కసరత్తులు పూర్తి చేసింది. నిధులు విడుదల చేసేందుకు అంతా రెడీ చేసింది. అయితే రైతు భరోసా… వ్యవసాయం చేసే రైతులందరికీ వర్తిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందులో ట్విస్ట్‌ కూడా ఇచ్చింది. రైతులందరికీ వస్తుంది. కాని వ్యవసాయ భూమి ఉంటేనే వర్తిస్తుందని చెప్పింది. దీనిపై రెండు మూడు రోజులుగా కన్‌ఫ్యూజన్‌ ఏర్పడింది. భూమి ఉన్నా.. ఆ సీజన్‌లో పంటవేయకుంటే భరోసా నిధులు రావంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది.

రైతు భరోసా.. తెలంగాణలోని మొత్తం 1.35 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి వర్తించేలా పథకాన్ని రూపొందించారు. దీంతో 64లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అంటే.. దాదాపు 12 లక్షల కుటుంబాలకు వర్తిస్తుంది. అయితే గ్రామసభలతోనే అర్హుల జాబితాను రూపొందించనుంది ప్రభుత్వం.  ఈనెల 20 వరకు అర్హుల ఎంపిక జరుగుతుంది. 26 నుంచి రైతుల అకౌంట్లలో భరోసా నిధులు జమ అవుతాయి.ఎకరానికి 6వేల రూపాయల చొప్పున, ఏడాదికి రూ.12వేలు భరోసా నగదు రైతులకు లభించనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.9వేల కోట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది.  ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భూమిలేని ఉపాధిహామీ కూలిలకు ఏడాదికి రూ.12వేల ఆత్మీయ భరోసా లభించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.700 కోట్లు విడుదల చేయనున్నారు.

రైతు భరోసా దేనికి వర్తిస్తుంది? దేనికి వర్తించదు? అనేదానిపైనా క్లారిటీ వస్తోంది.

రైతు భరోసా దేనికి వర్తించదు?

  • — మైనింగ్‌, కొండలు, గుట్టలున్న భూమి
  • — రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, రహదారులు
  • — నివాస, పారిశ్రామిక, వాణిజ్య భూములు
  • — నాలా కన్వర్టెడ్‌ భూములు
  • — ప్రభుత్వం సేకరించిన భూములకు వర్తించదని తేల్చి చెప్పింది రేవంత్‌ సర్కారు.

రైతు భరోసా దేనికి వర్తిస్తుంది?

  • — వ్యవసాయ భూమి, అందులోనూ సాగులో ఉన్న భూమి
  • –సాగు చేసే భూములే కాకుండా.. సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా. అంటే ఆ సీజన్‌లో పంట వేయకున్నా సాగులో ఉన్న భూమి అయితే చాలు భరోసా వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.

రైతు భరోసాకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో గైడ్ లైన్స్ విడుదల చేయంది ప్రభుత్వం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి