IPL 2024: నాకౌట్‌లోనూ అదరగొట్టేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత పురుషుల జట్టు కూడా అగ్రస్థానానికి చేరుకుంటుందని అభిమానులు ఆశించారు. అయితే అదేమీ జరగలేదు. తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ వరుసగా ఆరు పరాజయాలు ఎదురయ్యాయి.

IPL 2024: నాకౌట్‌లోనూ అదరగొట్టేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
Royal Challengers Bengaluru
Follow us
Basha Shek

|

Updated on: May 20, 2024 | 9:37 PM

గత 16 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సీజన్ లో కూడా ప్రారంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కోసం పోటీలో ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత పురుషుల జట్టు కూడా అగ్రస్థానానికి చేరుకుంటుందని అభిమానులు ఆశించారు. అయితే అదేమీ జరగలేదు. తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ వరుసగా ఆరు పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంటుందని ఎవరూ అనుకోలేదు. అయితే గోడకు కొట్టిన బంతిలా గట్టిగా తిరిగొచ్చింది బెంగళూరు జట్టు. వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది ఆర్సీబీ. ఐపీఎల్ చరిత్రలో RCB మూడు సార్లు ఫైనల్ ఆడింది. మొత్తం 16 సీజన్లలో 14 సార్లు ప్లేఆఫ్‌లు ఆడే అవకాశం లభించింది. అలాగే మూడు ఎలిమినేటర్ మ్యాచ్‌లు మాత్రమే ఆడింది.

ఇవి కూడా చదవండి

IPL 2020లో, RCB మొదటిసారి ఎలిమినేటర్ రౌండ్‌కు చేరుకుంది. నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌తో ఆడింది. అయితే RCB 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2021లో మళ్లీ ఎలిమినేటర్ రౌండ్‌లో చోటు దక్కించుకుంది. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ RCB కలలపై నీళ్లు చల్లింది. 2022లో మూడోసారి RCB ఎలిమినేటర్ రౌండ్‌లోకి ప్రవేశించింది. ఆ సమయంలో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించి రెండో క్వాలిఫయర్ రౌండ్‌కు చేరుకుంది. కానీ అక్కడ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.

ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ మూడుసార్లు ఎలిమినేటర్ దశకు చేరుకుంది. ఈసారి ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. కానీ ఈసారి ఆర్సీబీ జట్టు ఫామ్ చూస్తుంటే చరిత్ర చెరిపేసే అవకాశం ఉంది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ఎలిమినేటర్ రౌండ్‌కు చేరుకోవడం అనుకున్నంత ఈజీ కాదు. నెట్ రన్ రేట్ కూడా అంతే ముఖ్యమైనది. అన్ని ఒత్తిళ్ల ను అధిగమించి మరీ ఆర్సీబీ జట్టు పుంజుకుంది. మరి రాబోయే మ్యాచుల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తుందో లేదో చూడాలి. RCB ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ మే 22 న రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..