Prabhas : ప్రభాస్ సినిమాపై తమన్ క్రేజీ కామెంట్స్.. థియేటర్లలో పూనకాలే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కల్కి ప్రాజెక్టుతో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది.

Prabhas : ప్రభాస్ సినిమాపై తమన్ క్రేజీ కామెంట్స్.. థియేటర్లలో పూనకాలే..
Raja Saab
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2025 | 1:01 PM

గతేడాది కల్కి 2898 ఏడీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. అటు వరుస విజయాలు.. ఇటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మంచి జోష్ మీదున్నారు డార్లింగ్. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న పలు చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ రాజాసాబ్ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని జపాన్ లో చేయబోతున్నట్లు చెప్పాడు. అందుకే జపనీస్ వెర్షన్ లో ఓ సాంగ్ చేయాలని చిత్రయూనిట్ కోరినట్లు వెల్లడించారు. ఈ మూవీలో ఓ డ్యూయెట్, స్పెషల్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో ఓ పాట, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉన్నాయని తెలిపారు. ఈ సినిమాను థియేటర్లలో ఫ్యాన్స్ ఎంతో ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని అన్నాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

రాజాసాబ్ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇన్నాళ్లు మాస్, యాక్షన్ చిత్రాలతో అలరించిన ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ మూవీతో వింటేజ్ డార్లింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ మరింత స్టైలీష్ లుక్ లో కనిపించనున్నారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.