Rohit Sharma: రోహిత్ శర్మ ఔట్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా ఎవరంటే?
Rohit Sharma: 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతి లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో, అతని స్థానంలో కెప్టెన్ కావడానికి ఇద్దరు ఆటగాళ్లు అతిపెద్ద పోటీదారులు.
India vs England: ఆస్ట్రేలియాలో ఘోర పరాజయాన్ని మరచిపోయిన టీమిండియా ఇప్పుడు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌పై కన్నేసింది. జనవరి 22 నుంచి ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 6 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ భాగం కావడం లేదని, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతనికి విశ్రాంతి ఇవ్వవచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, రోహిత్ శర్మ ఆడకపోతే వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది.
రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్ ఎవరు?
ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు జనవరి 12వ తేదీని ఐసీసీ డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా బీసీసీఐ జట్టును ప్రకటించవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఆడడం ఖాయం. కానీ, ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో మాత్రం అతను పాల్గొనడం ఖాయం. ఇటువంటి పరిస్థితిలో, రోహిత్ ఈ సిరీస్‌లో ఆడకపోతే, కెప్టెన్సీకి శుభ్‌మన్ గిల్ అతిపెద్ద పోటీదారుగా మారబోతున్నాడు. ఎందుకంటే, ఈ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రాకు కూడా విశ్రాంతి ఇవ్వడం దాదాపు ఖాయం.
టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత జింబాబ్వే పర్యటనలో టీ20 జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తరువాత, అతను శ్రీలంక పర్యటనలో టీ20, వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. సాధారణంగా, కెప్టెన్ ఆడనప్పుడు, వైస్ కెప్టెన్‌కు జట్టు కమాండ్ ఇవ్వనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కెప్టెన్ రేసులో శుభ్‌మన్ గిల్ ముందు వరుసలో ఉండబోతున్నాడు. గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాతే శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.
ఈ ఆటగాడు కెప్టెన్సీకి కూడా పెద్ద పోటీదారు..
శుభ్‌మన్ గిల్‌తో పాటు హార్దిక్ పాండ్యా కూడా కెప్టెన్సీకి పెద్ద పోటీదారు. ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ సిరీస్ నుండే వన్డేల్లో పునరాగమనం చేస్తాడని విశ్వసిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో, అతనికి కెప్టెన్సీ బాధ్యత కూడా ఇవ్వవచ్చు. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అనుభవం చాలా ఉంది. 2022 టీ20 ప్రపంచకప్ నుంచి టీ20 జట్టు కమాండ్‌ని నిర్వహిస్తున్నాడు. అయితే, తాజాగా సూర్యకుమార్ యాదవ్‌ను టీ20కి కెప్టెన్‌గా నియమించారు. అయితే, సూర్య వన్డే జట్టులో భాగం కావడం లేదు. దీంతో పాండ్యాకు కూడా కెప్టెన్‌గా అవకాశం దక్కనుంది. మరోవైపు, కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్సీకి పోటీదారు కావచ్చు. కానీ, అతను ఈ రేసులో గిల్, పాండ్యా కంటే చాలా వెనుకబడ్డాడని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..