Video: 0,0,0,0,W,0.. సూపర్ ఓవర్‌లో డేంజరస్ బౌలింగ్.. 10 ఏళ్లుగా బద్దలవ్వని రికార్డ్ భయ్యా.. వీడియో చూశారా?
Unbreakable Records in Cricket: క్రికెట్ హిస్టరిలో ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి. వీటిలో కొన్ని బ్రేక్ అవుతుంటాయి. మరికొన్ని అలాగే ఉండిపోతుంటాయి. ఇలాంటి ఓ రికార్డ్ 10 ఏళ్లుగా బద్దలవ్వలేదు. ఇకపై ఈ రికార్డ్ బ్రేక్ చేయడం కూడా కష్టమేనని తెలుస్తోంది. అలాంటి రికార్డ్ ఓ బౌలర్, అది కూడా సూపర్ ఓవర్‌లో రావడం అద్భుతం.
Unbreakable Records in Cricket: క్రికెట్‌లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త రూల్స్‌తో ప్రతీ ఫార్మాట్‌లో ఆటను మరింత రంజుగా మార్చుతున్నారు. పొట్టి పార్మాట్‌లో ఇలాంటి మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్ల హవా కొనసాగుతోంది. అయితే, అప్పుడప్పుడూ బౌలర్లు కూడా తమ సత్తా చూపిస్తూ, బ్యాటర్లను సైలెంట్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ రికార్డ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ బౌలర్ కూడా బద్దలు కొట్టడం సాధ్యం కాదనిపిస్తోంది. ఈ రికార్డు 10 సంవత్సరాలుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. సూపర్ ఓవర్‌లో బ్యాట్స్‌మెన్‌లను సైలెంట్ ఉంచిన ది గ్రేట్ బౌలర్ గురించి చెప్పుకుందాం..
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్..
టీ20 క్రికెట్‌లో మెయిడిన్ ఓవర్ బౌలింగ్ చేయడం ప్రతి బౌలర్‌కు ఓ డ్రీమ్. కానీ, సూపర్ ఓవర్‌లో జీరో పరుగులు ఇవ్వడం అంటే, ఇది అద్భుతం కంటే తక్కువేం కాదు. వెస్టిండీస్ దిగ్గజ స్పిన్ మాస్టర్ సునీల్ నరైన్ టీ20 క్రికెట్‌లో సూపర్ ఓవర్ మెయిడిన్ బౌలింగ్ చేసి తిరుగులేని రికార్డు సృష్టించాడు. 2014లో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో రెడ్ స్టీల్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. ఇదే మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించి ఔబరా అనిపించాడు.
సూపర్ ఓవర్‌లో బ్యాటర్లు సైలెంట్..
మ్యాచ్‌లో 20 ఓవర్ల తర్వాత స్కోరు సమానంగా ఉంది. రెడ్ స్టీల్ 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. గయానా అమెజాన్ వారియర్స్ కూడా 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. దీంతో ఇరుజట్లు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్‌లో ఒక ఓవర్ ఎలిమినేటర్‌లో వారియర్స్ మొదట బ్యాటింగ్ చేసి 11 పరుగులు చేసింది. దీంతో స్టీలర్స్‌కు 12 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరూ నమ్మలేకపోతున్నారు. సునీల్ నరైన్ వేసిన 6 బంతుల్లో ప్రత్యర్థి జట్టు స్టార్ ప్లేయర్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు.
ఓవర్ ఎలా సాగిందంటే?
నికోలస్ పురాన్ తన తుఫాన్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన స్టీల్స్ కోసం బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. కానీ నరేన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతికి పురన్‌కు పరుగులు రాలేదు. రెండో బంతిని స్కిడ్ చేయబోయి మిస్ చేసుకున్నాడు. మూడో బంతి కూడా అదే లైన్‌లో ఉండడంతో పురాన్‌ను మళ్లీ దెబ్బతీశాడు. నాలుగో బంతికి కూడా పురాన్ బ్యాట్ ఝుళిపించినా పరుగులు రాలేదు. ఇక 5వ బంతిని పురన్ లాంగ్ ఆఫ్‌లోకి తరలించగా మార్టిన్ గప్టిల్ చేతికి చిక్కాడు.
వీడియో..
ఆరో బంతిని ఎదుర్కొనేందుకు వచ్చిన రాస్ టేలర్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించి మిస్సయ్యాడు. ఈ విధంగా నరేన్ జట్టును విజయపథంలో నడిపించడమే కాకుండా తన పేరిట తిరుగులేని రికార్డును నమోదు చేసుకున్నాడు.