IPL 2022: వేలంలో ఎంతమంది విదేశీ ఆటగాళ్లు అమ్ముడుపోయారు.. అత్యధికంగా ఏ ఆటగాడికి చెల్లించారు..?

IPL 2022: ఐపీఎల్ 2022 వేలం రెండు రోజుల పాటు కొనసాగింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో 10 మంది ఐపిఎల్ ఫ్రాంచైజీలు వందలాది మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. ఐపిఎల్

IPL 2022: వేలంలో ఎంతమంది విదేశీ ఆటగాళ్లు అమ్ముడుపోయారు.. అత్యధికంగా ఏ ఆటగాడికి చెల్లించారు..?
Ipl 2022
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 15, 2022 | 3:28 PM

IPL 2022: ఐపీఎల్ 2022 వేలం రెండు రోజుల పాటు కొనసాగింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో 10 ఫ్రాంచైజీలు వందలాది మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. ఐపిఎల్ వేలంలో మొత్తం 600 మంది ఆటగాళ్ల పేర్లను చేర్చగా.. ఇందులో 203 మంది ప్లేయర్స్ అమ్ముడుపోయారు. ఈసారి వేలంలో 67 మంది విదేశీ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అత్యధికంగా వెస్టిండీస్‌కు చెందిన 14 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఆస్ట్రేలియా నుంచి 12 మంది ఆటగాళ్లు, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా నుంచి11 మంది చొప్పున అమ్ముడుపోయారు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లకు చెందిన ఆటగాళ్లు కూడా IPL 2022తో సంబంధం కలిగి ఉన్నారు.

ఐపీఎల్ 2022 వేలంలో భారత్‌తో పాటు 14 దేశాల నుంచి మొత్తం 223 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి గరిష్టంగా 47 మంది, వెస్టిండీస్ నుంచి 34, దక్షిణాఫ్రికా నుంచి 33 మంది పేర్లు వచ్చాయి. ఐపీఎల్ టీమ్‌లు ఇప్పటికే రిటైన్ చేసుకున్న కొందరు ఆటగాళ్లు కూడా ఉన్నారు. అలాంటి జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి.

1. ఆస్ట్రేలియా

రిటైన్డ్ ప్లేయర్స్: మార్కస్ స్టోయినిస్ (లక్నో) రూ. 9.2 కోట్లు, గ్లెన్ మాక్స్‌వెల్ (ఆర్‌సిబి) – రూ.11 కోట్లు.

అమ్ముడుపోయిన ఆటగాళ్లు: పాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్, జోష్ హేజిల్‌వుడ్, డేనియల్ సామ్స్, టిమ్ డేవిడ్, షాన్ అబాట్, నాథన్ ఎల్లిస్, నాథన్ కౌల్టర్-నైల్, రిలే మెరెడిత్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్.

అధిక ధర పలికిన ఆటగాడు: టిమ్ డేవిడ్ (ముంబై) రూ 8.25 కోట్లు.

2. ఆఫ్ఘనిస్తాన్

గుజరాత్ టైటాన్స్: రషీద్ ఖాన్ 15 కోట్లు.

అమ్ముడుపోయిన ఆటగాళ్లు: ఫజ్లాక్ ఫరూఖీ, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్.

అధిక ధర పలికిన ఆటగాడు: మహ్మద్ నబీ (కెకెఆర్) – రూ.1 కోటి.

3. బంగ్లాదేశ్

అమ్ముడుపోయిన ఆటగాళ్లు: ముస్తాఫిజుర్ రెహమాన్ (ఢిల్లీ) – రూ.2 కోట్లు.

4. ఇంగ్లండ్

రిటైన్డ్ ప్లేయర్స్: మొయిన్ అలీ (సిఎస్‌కె) – రూ. 8 కోట్లు, జోస్ బట్లర్ (రాజస్థాన్) – రూ. 10 కోట్లు.

అమ్ముడుపోయిన ఆటగాళ్లు: జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టన్, టైమల్ మిల్స్, అలెక్స్ హేల్స్, జోఫ్రా ఆర్చర్, డేవిడ్ విల్లీ, బెన్నీ హోవెల్.

అధిక ధర పలికిన ఆటగాడు: లియామ్ లివింగ్‌స్టన్ (పంజాబ్) – రూ. 11.50 కోట్లు.

5.న్యూజిలాండ్

రిటైన్డ్ ప్లేయర్స్: కేన్ విలియమ్సన్ – రూ. 14 కోట్లు.

అమ్ముడుపోయిన ఆటగాళ్లు: ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సీఫెర్ట్, జేమ్స్ నీషమ్, ఫిన్ అలెన్, టిమ్ సౌథీ, డెవాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే.

అధిక ధర పలికిన ఆటగాడు: లాకీ ఫెర్గూసన్ (గుజరాత్) – రూ. 10 కోట్లు.

6. దక్షిణ ఆఫ్రికా

రిటైన్డ్ ప్లేయర్స్: ఎన్రిఖ్ నోర్కియా (ఢిల్లీ) – రూ 6.50 కోట్లు.

అమ్ముడుపోయిన ఆటగాళ్లు: క్వింటన్ డి కాక్, లుంగి ఎన్గిడి, ఫాఫ్ డు ప్లెసిస్, కగిసో రబడా, డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్, ఐడెన్ మార్క్రామ్, మార్కో యాన్సన్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, డ్వేన్ ప్రిటోరియస్.

అధిక ధర పలికిన ఆటగాడు: కగిసో రబడ (పంజాబ్) – రూ. 9.25 కోట్లు.

7. శ్రీలంక

అమ్ముడుపోయిన ఆటగాళ్లు: వనిందు హసరంగా, భానుక రాజపక్స, దుస్మంత చమీర, మహేష్ తీక్షణ.

అధిక ధర పలికిన ఆటగాడు: వనిందు హసరంగా (ఆర్‌సిబి) – రూ. 10.75 కోట్లు.

8. వెస్టిండీస్

రిటైన్డ్ ప్లేయర్స్: కీరన్ పొలార్డ్ -, ఆండ్రీ రస్సెల్ (కెకెఆర్) – రూ. 12 కోట్లు, సునీల్ నరైన్ (కెకెఆర్) – రూ. 6 కోట్లు.

అమ్ముడుపోయిన ఆటగాళ్లు: షిమ్రాన్ హెట్మెయర్ , డ్వేన్ బ్రావో, జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్, డొమినిక్ డ్రేక్స్, ఓడియన్ స్మిత్, ఎవిన్ లూయిస్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, ఫాబియన్ అలెన్, ఒబెడ్ మెక్‌కాయ్, అల్జారీ జోసెఫ్, కైల్ మైర్స్ జోసెఫ్.

అధిక ధర పలికిన ఆటగాడు: నికోలస్ పూరన్ (హైదరాబాద్) – రూ. 10.75 కోట్లు.

IPL 2022: ఈ 4 కోట్ల ఆల్‌రౌండర్‌పై ధోని ఎన్నో ఆశలు.. టీమిండియాలో చోటు లభిస్తుందా..?

LIC IPO: ఎల్ఐసీ IPOలో పెట్టుబడి పెడుతున్నారా.. కచ్చితంగా ఈ 10 విషయాలపై ఓ లుక్కేయండి..?

Viral Video: గేదె పిల్లపై అటాక్ చేసిన రెండు భారీ సింహాలు.. మరి తల్లి గేదె ఊరుకుంటుందా..?

Latest Articles
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!
తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!
OTTలో గీతాంజలి.. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్.
OTTలో గీతాంజలి.. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్.