LIC IPO: ఎల్ఐసీ IPOలో పెట్టుబడి పెడుతున్నారా.. కచ్చితంగా ఈ 10 విషయాలపై ఓ లుక్కేయండి..?

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దేశంలో అతిపెద్ద IPOకు సంబంధించి పత్రాలు SEBIకి చేరాయి. ఈ IPOలో పాలసీ హోల్డర్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చారు.

LIC IPO: ఎల్ఐసీ IPOలో పెట్టుబడి పెడుతున్నారా.. కచ్చితంగా ఈ 10 విషయాలపై ఓ లుక్కేయండి..?
Lic Ipo
Follow us
uppula Raju

|

Updated on: Feb 15, 2022 | 12:18 PM

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దేశంలో అతిపెద్ద IPOకు సంబంధించి పత్రాలు SEBIకి చేరాయి. ఈ IPOలో పాలసీ హోల్డర్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చారు. ఈ IPO కోసం మార్కెట్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయించాలనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఓ 60 నుంచి 90 వేల కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అందరు భావిస్తున్నారు. మీరు కూడా ఈ IPOలో పెట్టుబడి పెట్టాలనుకుంటే కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్‌లను తెలుసుకోవడం చాలా ముఖ్యం. SEBIకి సమర్పించిన IPO డాక్యుమెంట్ (DRHP)లో వివిధ ప్రమాద కారకాలు కూడా ప్రస్తావించారు. ఇది ప్రమాద బీమా వ్యాపారంతో ముడిపడి ఉంటుంది. ఇందులో కొన్ని అంతర్గత ప్రమాదం, కొన్ని బాహ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

1. కరోనా వల్ల విధించిన పరిమితుల కారణంగా LIC కార్యాచరణపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఎల్‌ఐసీ పెట్టుబడులు తగ్గగా డిసెంబర్ త్రైమాసికంలో మార్కెట్ షేర్‌లో ఎల్‌ఐసీ షేరు రికార్డు స్థాయికి దిగజారింది. ఎల్ఐసీ షేర్ హోల్డింగ్ మార్కెట్ విలువ కేవలం 3.67 శాతానికి తగ్గింది.

2. కరోనా కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ డెత్ క్లెయిమ్ ప్రయోజనాన్ని పెద్ద ఎత్తున చెల్లించాల్సి ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డెత్ క్లెయిమ్ మొత్తం1,71,288 మిలియన్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,75,279 మిలియన్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2,39,268 మిలియన్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,17,341 మిలియన్లు.

3. కరోనా కారణంగా బీమాకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ సంక్షోభ సమయంలో LIC ఉద్యోగులు, ఏజెంట్లు బ్రాండ్ పేరును దుర్వినియోగం చేశారు. మొత్తంమీద ఎల్‌ఐసీ బ్రాండ్‌కు గట్టి దెబ్బ తగిలింది.

4. ఎల్‌ఐసీ ఏళ్ల నుంచి సంప్రదాయబద్ధంగా పనిచేస్తోంది. మారుతున్న కాలంలో రిస్క్ మూల్యాంకనం, రిస్క్ మేనేజ్‌మెంట్ పద్ధతి మారింది. LIS ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేయడంలేదు.

5. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ IDBI, LIC హౌసింగ్ ఫైనాన్స్ మాతృ సంస్థ. వచ్చే నెలలోగా ఈ రెండింటిలో ఏదైనా ఒక దానిని మూసివేయాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ షరతుపై ఎల్ఐసీ ఐపీఓకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఇది పెద్ద ఎదురుదెబ్బ.

6. భారతదేశ స్థూల ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోంది. LIC వ్యాపారం పూర్తిగా భారతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉంటే అది ఎల్‌ఐసి వ్యాపారంపై ప్రభావం చూపుతుంది.

7. అమెరికాతో సహా ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతోంది. ఫెడరల్ రిజర్వ్‌తో సహా అన్ని సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే ఆలోచనలో ఉన్నాయి. దీని వల్ల మార్కెట్లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం ఐపీఓపై కూడా పడవచ్చు.

8. డీఆర్‌హెచ్‌పీలో నిబంధనలలో ఏదైనా మార్పు జరిగితే దాని ప్రభావం వ్యాపారంపై పడుతుందని పేర్కొంది. రాబోయే కాలంలో భారత్‌లో లేదా ప్రపంచంలో ఎలాంటి ఆర్థిక నియంత్రణలు వచ్చినా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

9. భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలను ఎదుర్కొంటోంది. పన్ను, ఆర్థిక విధానంలో మార్పులు జరగవచ్చు. ఈ ప్రభావం ఐపీవోపై ఉండే అవకాశాలు ఉన్నాయి.

10. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 95 శాతం వాటా భారత రాష్ట్రపతి వద్దనే ఉంటుంది. దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి.

Viral Video: గేదె పిల్లపై అటాక్ చేసిన రెండు భారీ సింహాలు.. మరి తల్లి గేదె ఊరుకుంటుందా..?

IPL 2022: సురేశ్ రైనాని చెన్నై ఎందుకు వదిలేసింది.. కారణం వెల్లడించిన సీఈవో..?

Arthritis: కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ నాలుగు పనులు చేస్తే మాయం..?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!