Investment Tips: స్టాక్ మార్కెట్‌లో తొలిసారిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా.. ఈ 5 అంశాలను తప్పక దృష్టిలో పెట్టుకోండి..

Investment Tips: ఈ కాలంలో చాలా మంది తాము సంపాదించే దానిలో కొంత భాగాన్ని ఇన్వెస్ట్(Investment) చేయాలని యోచిస్తున్నారు. కానీ.. కొత్తగా మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి అయోమయం, భయాన్ని కలిగించవచ్చు. వీటిని అదిగమించేందుకు..

Investment Tips: స్టాక్ మార్కెట్‌లో తొలిసారిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా.. ఈ 5 అంశాలను తప్పక దృష్టిలో పెట్టుకోండి..
Investment Tips
Follow us

|

Updated on: Feb 15, 2022 | 11:59 AM

Investment Tips: ఈ కాలంలో చాలా మంది తాము సంపాదించే దానిలో కొంత భాగాన్ని ఇన్వెస్ట్(Investment) చేయాలని యోచిస్తున్నారు. కానీ.. కొత్తగా మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి అయోమయం, భయాన్ని కలిగించవచ్చు. వీటిని అదిగమించేందుకు కొత్త పెట్టుబడిదారులు పెట్టుబడులు ఎలా పెట్టాలి అనే దానిపై పర్సనల్ ఫైనాన్స్ నిపుణుల సలహాలు తీసుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఈ ప్రక్రియలో అందరూ చేసే కొన్ని తప్పిదాలను మీరు చేయకుండా ముందుకెళ్లడం నేర్చుకోండి. ఇందుకోసం ముందుగా ఈ 5 సూత్రాలను తెలుసుకోండి.

1. మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం అనేది ప్రత్యేకంగా ఉండదు..

మార్కెట్లు ఎప్పుడు ఉత్తమ రిటర్న్ ఇస్తాయనేది ఎవరూ చెప్పలేని అంశం. మీరు మీ సొంత విస్లేషణకు అనుగుణంగా మార్కెట్ ఎలా ఉండవచ్చు అనేది ఊహించవచ్చు. కానీ.. మార్కెట్ లో ఎప్పుడూ పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు సైతం ఎప్పుడు మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి అనే విషయాలను ముందుగా చెప్పలేరు. మార్కెట్ లో ముందుగా గుర్తుంచుకోవాలసిన విషయం ఏంటంటే.. ఎప్పుడు పెట్టుబడి పెడుతున్నామన్నది కాదు.. ఎంతకాలం పెట్టుబడి పెడుతున్నాం అన్నది ముఖ్యం. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుంది.

2. పెట్టుబడిని సరిగా నిర్వహించడం..

పెట్టుబడి పెడుతున్న మెుత్తాన్ని ఒకేదానిలో పెట్టకుండా ఉండడం మంచిది. అదే సమయంలో ఉన్న మెుత్తం సొమ్మును మరీ ఎక్కువ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టకుండా చూసుకోవాలి. ఒకే రకమైన ఫండ్లలో పెట్టుబడి పెట్టకూడదు. అలా చేయటం వల్ల మీరు ఊహించిన లాభాలు రాకపోవచ్చు. దీని ప్రకారం 3 నుంచి 4 ఎసట్ క్లాసెస్(ఈక్విటీ, హైబ్రిడ్, గ్రోబల్ ఫండ్స్..) లను ఎంచుకోవటం మంచిది.

3. రిస్క్ ఎప్పుడూ చెడ్డదికాదు..

రిస్క్, రిటన్ రెండు కలిసి ఉంటాయని సీజనల్ ఇన్వెస్టర్లకు తెలుసు. పెట్టుబడిదారులకు ఉండే అపోహ ఎంటంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటన్ ఉంటుందని. కానీ అది వాస్తవం కాదు. తక్కువ రిస్కు తీసుకుంటూ కూడా పెట్టుబడిపై మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. రిస్క్ అనే అంశం లేకుండా ఉండే పెట్టుబడి అనేది అసలు ఉండదు. కాబట్టి పెట్టుబడిదారులు తమ రిస్క్ కు తగినట్లుగా నిర్ణయాలు తీసుకోవచ్చు.

4. పెట్టుబడి పెట్టే కంపెనీ క్వాలిటీ ముఖ్యం..

తక్కువ కాల వ్యవధిలో ఎక్కువగా విలువ పెరిగే సెక్యూరిటీలు చాలా ఎక్కువ రిస్క్ కలిగి ఉంటాయని గ్రహించాలి. దీర్ఘకాలంలో మంచి లాభాలను, ఎదుగుదలను ఇచ్చే కంపెనీలను పెట్టుబడులు పెట్టడానికి ఎంచుకోవడం మంచిది. మార్కెట్ లో మంచి పనితీరు కనబరుస్తూ.. లాభాలను గడించే వ్యాపారాలు ఉత్తమమైనవి. విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు దానిని సదరు సంస్థ యాజమాన్యం తట్టుకుని ముందుకెళ్లగలదా లేదా అనే విషయాన్ని పెట్టుబడి పెట్టడానికి ముందు అంచనా వేయాలి.

5. ఎసట్ ఎలకేషన్ అనేది కీలకమైన అంశం..

ఈ రోజుల్లో మదుపరుల ముందు అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అనే పెట్టుబడి స్కీములను మనం గమనిస్తూనే ఉన్నాం. వీలైనంత వరకు పెట్టుకున్న గోల్ చేరుకోవడానికి ఎసట్ ఎలకేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారు వ్యక్తిగత రిస్క్ అదారంగా ఎందులో ఎంత పెట్టుబడి పెట్టాలి అనే నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంటుంది. దీని వల్ల మార్కెట్ లోని ఒడిదుడుకులను అదిగమిస్తూ ముందుకు వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. సరైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం అనేది మదుపరుని చేతిలోనే ఉంటుంది.

ఇవీ చదవండి.. 

LIC IPO: ఎల్ఐసీ పాలసీదారులు అలర్ట్.. ఐపీవోలో పెట్టుబడి పెట్టాలంటే ఇవి తప్పనిసరి..?

Income From IPO: ఐపీఓల ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చు?