AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: ఎల్ఐసీ పాలసీదారులు అలర్ట్.. ఐపీవోలో పెట్టుబడి పెట్టాలంటే ఇవి తప్పనిసరి..?

LIC IPO: ఎల్ఐసీ ఐపీవోని తీసుకొస్తున్న విషయం అందరికి తెలిసిందే. కంపెనీ ఐపీవో కోసం సెబీకి ముసాయిదా పత్రాలను కూడా దాఖలు చేసింది. మార్చిలో ఐపీఓ మార్కెట్‌లోకి రానుంది.

LIC IPO: ఎల్ఐసీ పాలసీదారులు అలర్ట్.. ఐపీవోలో పెట్టుబడి పెట్టాలంటే ఇవి తప్పనిసరి..?
Lic Ipo
uppula Raju
|

Updated on: Feb 15, 2022 | 9:10 AM

Share

LIC IPO: ఎల్ఐసీ ఐపీవోని తీసుకొస్తున్న విషయం అందరికి తెలిసిందే. కంపెనీ ఐపీవో కోసం సెబీకి ముసాయిదా పత్రాలను కూడా దాఖలు చేసింది. మార్చిలో ఐపీఓ మార్కెట్‌లోకి రానుంది. SEBIకి దాఖలు చేసిన ముసాయిదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం ఎల్‌ఐసీ 31 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ని మార్చి నాటికి స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎల్‌ఐసి పాలసీ హోల్డర్లు ఈ ఐపిఓలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే ఇందులో 10 శాతం వారికి రిజర్వ్ చేశారు. అంటే పాలసీదారుల్లో వాటాలు పొందే అవకాశాలు పెరుగుతాయి. అయితే ఇందులో పెట్టుబడి కావాలంటే కొన్ని పత్రాలు అవసరం. వాటి గురించి తెలుసుకుందాం.

IPOలో పెట్టుబడికి ముందు ఇవి సిద్దం చేయండి..

మీరు LIC IPOలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా కొన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. ముందుగా LIC పాలసీ ఖాతాకు PAN, Demat ఖాతాను లింక్ చేసి ఉండాలి. అంటే మీరు ఈ రెండు పనులను వీలైనంత త్వరగా చేయాలి. పాన్ అప్‌డేట్ చేయాలి. ఇందుకోసం ఈ పద్దతులను పాటించండి.

1. ముందుగా LIC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. హోమ్‌పేజీలో ‘ఆన్‌లైన్ పాన్ రిజిస్ట్రేషన్’ ఎంపికను ఎంచుకోండి.

3. రిజిస్ట్రేషన్ పేజీలో ‘ప్రొసీడ్’పై క్లిక్ చేయండి.

4. కొత్త పేజీలో PAN, ఈ మెయిల్, మొబైల్ నంబర్, పాలసీ నంబర్‌ని పూరించండి.

5. తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.

6. OTP అభ్యర్థనపై క్లిక్ చేయండి.

7. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

8. OTPని నమోదు చేసి సమర్పించండి.

9. తర్వాత రిజిస్ట్రేషన్ సందేశాన్ని పొందుతారు.

10. పుట్టిన తేదీ, పాలసీ-పాన్ నంబర్ స్థితిని మరోసారి తనిఖీ చేయండి.

పాలసీ హోల్డర్స్-ఉద్యోగుల షేర్ రిజర్వ్

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎల్‌ఐసి పాలసీ హోల్డర్‌లు, కంపెనీ ఉద్యోగుల కోసం షేర్ రిజర్వ్ చేసింది. ఈ రెండు వర్గాలకు రాయితీ ఇస్తుంది. సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రం ప్రకారం.. ఇష్యూలో 10 శాతం పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేసింది. మీ LIC పాలసీ ల్యాప్ అయినప్పటికీ మీరు రిజర్వ్ కోటాలో వేలం వేయవచ్చు. ఇది కాకుండా ఎల్‌ఐసి ఉద్యోగులకు 5 శాతం వాటా రిజర్వ్ చేసింది.

Viral Photo: ఆశ్చర్యం.. పులి నిజంగానే నవ్వుతుందా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైగర్ ఫొటో..?

Pakistan Cricketer: గుజరాత్‌లో జన్మించిన పాకిస్తాన్ క్రికెటర్ మృతి.. అతడి నలుగురు సోదరులు క్రికెటర్లే..?

Weight Loss Tips: ఎక్కువ సేపు నిద్రపోతే బరువు తగ్గుతారట.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..