- Telugu News Photo Gallery Business photos Mahindra offers discount on new cars in February, leaves out XUV700, Thar SUVs
Mahindra Offers: మహీంద్రా అండ్ మహీంద్రా కార్లపై భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు ఆదా..!
Mahindra Offers: కొత్త కారు కొనుగోలు చేసేవారికి మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో కరోనా కారణంగా కార్ల అమ్మకాలు పూర్తిగా పడిపోగా, ప్రస్తుతం కరోనా నుంచి బయటపడుతున్న ..
Updated on: Feb 15, 2022 | 9:17 AM

Mahindra Offers: కొత్త కారు కొనుగోలు చేసేవారికి మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో కరోనా కారణంగా కార్ల అమ్మకాలు పూర్తిగా పడిపోగా, ప్రస్తుతం కరోనా నుంచి బయటపడుతున్న సందర్భంలో కార్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. తర్వాత విక్రయాలు జోరుగా సాగేందుకు ఆయా కార్ల తయారీ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటించాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల కొనుగోలుదారులకు భారీ ఆఫర్లను ప్రకటించింది. పలు మోడళ్లపై రూ.80 వేల వరకు భారీ డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఇక మహీంద్రా కార్లలో అత్యధిక ఖరీదైనది అల్ట్రాస్ జి4 SUV ఉండగా, ఈ కారుపై రూ.81,500 వరకు తగ్గింపు ప్రయోజనం పొందవచ్చు. ఈ కారు మార్కెట్లో టాయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్ కార్లకు పోటీగా నిలిచింది.

మహీంద్రా ఆల్టురాస్ జీ4 రూ.50 వేల వరకు ఎక్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు కలిసి అదనంగా రూ.31 వేల వరకు పొందే అవకాశం ఉంది.

సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 300 అన్ని కార్లలో ఆఫర్లు పొందవచ్చు. ఈ కారుపై రూ.69 వేల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఈ కారు రూ.30వేల తగ్గింపుతో పాటు మహీంద్రా SUV 300ను ఎక్ఛేంజ్ బోనస్ రూ.25వేలు, కార్పొరేట్ తగ్గింపు రూ.4వేలు, అలాగే రూ.10వేల విలువగల ఇతర బెనిఫిట్స్ కూడా పొందవచ్చని కంపెనీ తెలిపింది.

SUV కేయూవీ100నెక్ట్స్‌పై కూడా రూ.60వేలకుపైగా ప్రయోజనం పొందవచ్చు. అలాగే మహీంద్రా ఎక్స్‌యూవీ 700పై కూడా డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. ఇలా మహీంద్రాకు చెందిన ఇతర మోడళ్లపై ఆఫర్లు, డిస్కౌంట్‌లు పొందవచ్చు.




