Viral Photo: ఆశ్చర్యం.. పులి నిజంగానే నవ్వుతుందా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైగర్ ఫొటో..?
Tiger Photo: పులి అంటే ముందుగా గుర్తుకొచ్చేది దాని గర్జన.. అది ఒక్కసారి గర్జిస్తే అడవి మొత్తం దద్దరిల్లిపోతుంది. మనిషి అయినా, జంతువైనా దాన్ని చూడగానే ఆలోచించడం
Tiger Photo: పులి అంటే ముందుగా గుర్తుకొచ్చేది దాని గర్జన.. అది ఒక్కసారి గర్జిస్తే అడవి మొత్తం దద్దరిల్లిపోతుంది. మనిషి అయినా, జంతువైనా దాన్ని చూడగానే ఆలోచించడం మానేసి పరుగులు పెడుతారు. పులి గర్జిస్తే దాదాపు మూడు కిలోమీటర్ల వరకు వినబడుతుంది. అయితే తాజాగా స్మైల్ ఇచ్చిన టైగర్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఈ నవ్వుతున్న పులి ఫొటో చూస్తే దాని దంతాలు ఎంత బలమైనవో తెలుస్తుంది. ఇందులో ఒక్కసారి ఎర చిక్కుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేదు. వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని మోనా పటేల్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. అంతేకాదు దాని గురించి కొంత సమాచారం కూడా ఇచ్చాడు. ‘పులులు పళ్ళు లేకుండా పుడతాయి. కొన్ని వారాల తర్వాత వాటికి కూడా మనుషుల మాదిరిగానే పాల పళ్ళు వస్తాయి. అవి కొన్ని రోజులకు ఊడిపోతాయి. అందుకే వాటి దంతాలలో చాలా ఖాళీ ఏర్పడుతుంది. దీనివల్ల అవి ఎరను గట్టిగా పట్టుకుంటాయి. పులి నోటిలో ఎర చిక్కుకుందంటే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం’ అని తెలిపాడు.
అయితే ఈ టైగర్ చిత్రాన్ని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. వార్తలు రాసే సమయానికి ఈ ఫొటోకి వేలల్లో లైక్‌లు, వందల కొద్దీ రీట్వీట్లు వచ్చాయి. ఇది మాత్రమే కాదు ఈ అందమైన చిత్రం షేర్ చేసినందుకు దాని గురించి మంచి సమాచారం అందించినందుకు మోనా పటేల్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫొటో చూసిన చాలా మంది నెటిజన్లు తమ స్పందనను కామెంట్ రూపంలో తెలుపుతున్నారు. ఒకరు ఇలా రాశారు.. టైగర్ ఫోటోగ్రాఫర్ కోసం పోజు ఇచ్చినట్లుగా ఉందన్నాడు. మరొకరు ఇది టైగర్ రాయల్ స్మైల్ అని కామెంట్ చేశారు. చాలామంది ఈ ఫొటోని లైక్ చేశారు. మీరు కూడా ఈ ఫొటోని చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
Tigers are born toothless. After few short weeks,tigers get their milk teeth. Their teeth fall out like humans but not until the adult teeth push the milk teeth out. Tigers have large gaps in their teeth. This makes it easy for them to grasp their prey tightly.#ThePhotoHour ?? pic.twitter.com/ZNJzZKtojl
— Mona Patel ???? (@MonaPatelT) February 13, 2022