AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: సురేశ్ రైనాని చెన్నై ఎందుకు వదిలేసింది.. కారణం వెల్లడించిన సీఈవో..?

IPL 2022: ఐపీఎల్ -2022 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు చాలామంది పాత ఆటగాళ్లని కొనుగోలు చేయలేదు. అందులో చెన్నై కూడా సురేష్ రైనాను వదిలేసింది. ఐపీఎల్ ప్రారంభం

IPL 2022: సురేశ్ రైనాని చెన్నై ఎందుకు వదిలేసింది.. కారణం వెల్లడించిన సీఈవో..?
Suresh Raina
uppula Raju
|

Updated on: Feb 15, 2022 | 10:39 AM

Share

IPL 2022: ఐపీఎల్ -2022 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు చాలామంది పాత ఆటగాళ్లని కొనుగోలు చేయలేదు. అందులో చెన్నై కూడా సురేష్ రైనాను వదిలేసింది. ఐపీఎల్ ప్రారంభం నుంచి రైనా చెన్నై జట్టులోనే ఉన్నాడు. చెన్నైపై నిషేధం విధించినప్పుడు గుజరాత్ లయన్స్‌కు కెప్టెన్‌గా మారాడు. జట్టులో చిన్న తాల పేరుతో ప్రసిద్ధి చెందాడు. కానీ ఇప్పుడు అతను పసుపు జెర్సీలో కనిపించడు. ఎందుకంటే రైనాని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయలేదు. దీనికి కారణాన్ని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ వెల్లడించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌లలో రైనా ఒకరు. ఈ లీగ్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను చెన్నైకి ఆడుతూ 4678 పరుగులు చేశాడు. చెన్నై తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. అతన్ని మిస్టర్ ఐపిఎల్ అని కూడా పిలుస్తారు.

సీఎస్‌కే తరఫున రైనా నిలకడగా రాణిస్తున్నాడని అయితే వేలంలో ఆటగాళ్లను ఎంపిక చేసినప్పుడు జట్టు కూర్పు, ఫామ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్లని కొనుగోలు చేసినట్లు సీఈవో విశ్వనాథ్ తెలిపాడు. CSK తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో విశ్వనాథ్ మాట్లాడుతూ “రైనా గత 12 సంవత్సరాలుగా CSK కోసం బాగా రాణిస్తున్నాడు. అయితే రైనాను తీసుకోకపోవడం మాకు చాలా కష్టమైంది. అయితే జట్టు కూర్పు, ఫామ్‌ని దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్ల కొనుగోలు చేశామని” చెప్పాడు.

ఈ విషయాన్ని ఫాఫ్ డు ప్లెసిస్ తెలిపాడు

మరో విజయవంతమైన బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను కూడా చెన్నై కొనుగోలు చేయలేదు. ఫాఫ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఫాఫ్‌ను కొనుగోలు చేయకపోవడం గురించి CEO.. “మేము అతనిని కోల్పోయాం. ఫాఫ్ గత దశాబ్ద కాలంగా మాతో ఉన్నారు. అది వేలం ప్రక్రియ ఏమి చేయలేం” అన్నాడు. ఫాఫ్ గత సీజన్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

Arthritis: కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ నాలుగు పనులు చేస్తే మాయం..?

Weight Loss: 30 రోజుల్లో సులువుగా 5 కిలోలు తగ్గవచ్చు.. ఈ డైట్ పాటిస్తే అది సాధ్యమే..?

Ashwagandha: అశ్వగంధతో అద్భుత ప్రయోజనాలు.. ఈ వ్యాధులను నయం చేయడంలో సూపర్..