AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwagandha: అశ్వగంధతో అద్భుత ప్రయోజనాలు.. ఈ వ్యాధులను నయం చేయడంలో సూపర్..

Ashwagandha: ఆశ్వగంధ అద్భుత మూలిక. భారతీయ మూలికలలో రారాజు. ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. ప్రాచీన కాలం నుంచి ప్రజల హృదయాలను గెలుచుకుంది.

Ashwagandha: అశ్వగంధతో అద్భుత ప్రయోజనాలు.. ఈ వ్యాధులను నయం చేయడంలో సూపర్..
Ashwagandha
uppula Raju
|

Updated on: Feb 15, 2022 | 9:13 AM

Share

Ashwagandha: ఆశ్వగంధ అద్భుత మూలిక. భారతీయ మూలికలలో రారాజు. ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. ప్రాచీన కాలం నుంచి ప్రజల హృదయాలను గెలుచుకుంది. దీంతో జ్ఞాపకశక్తి నుంచి క్యాన్సర్ వరకు అన్ని వ్యాధులను నయం చేయవచ్చు. అశ్వగంధ పొడి రూపంలో ఉపయోగించినప్పుడు మెదడు, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శక్తి స్థాయిలను బలోపేతం చేస్తుంది. మైటోకాన్డ్రియల్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మేధస్సు, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మీ ఆహారంలో ఈ హెర్బ్‌ని చేర్చుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. అశ్వగంధ మరికొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స

అశ్వగంధని నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. నిద్రలేమి, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి న్యూరో-వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పిల్లలలో జ్ఞాపకశక్తి పెంచుతుంది.

2. శారీరక ధారుఢ్యాన్ని పెంచుతుంది..

ఒత్తిడి-ప్రేరిత గ్యాస్ట్రిక్ అల్సర్‌లను నివారించడంలో, శారీరక దారుఢ్యాన్ని పెంచడంలో అశ్వగంధ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణశయాంతర పేగు పూతలని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వివిధ రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

3. బలహీనతని నివారిస్తుంది..

మీ రెగ్యులర్ డైట్‌లో అశ్వగంధను చేర్చుకోవడం వల్ల బరువు పెరుగుతారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. అశ్వగంధ సాధారణ బలహీనతకు, న్యూరో-కండరాల సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని నిరూపించారు. అంతేకాదు బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజు అశ్వగంధ తీసుకుంటే కొద్దిరోజుల్లో బలంగా తయారవుతారు.

4. పునరుత్పత్తి ప్రయోజనాలు

ఈ మూలిక పురుషులకు పునరుత్పత్తి ప్రయోజనాలను అందిస్తుంది. సంతానం లేనివారిలో పునరుత్పత్తి హార్మోన్ స్థాయిలను తిరిగి సమతుల్యం చేస్తుంది. స్పెర్మ్ నాణ్యతను గణనీయంగా పెంచుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రేరేపితం చేస్తుంది. సంతానం కలిగించడంలో ఉపయోగపడుతుంది.

5. అన్ని రకాల క్యాన్సర్లని తగ్గిస్తుంది..

అశ్వగంధ పక్షవాతం కలిగించే బ్రెయిన్ స్ట్రోక్స్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలను, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లతో సహా అన్ని రకాల క్యాన్సర్‌లను మెరుగుపరుస్తుంది. వృద్ధుల చివరి దశలో చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అశ్వగంధ ఆధునిక చికిత్స కంటే ఎన్నో రెట్లు మేలని నిరూపణ అయింది.

LIC IPO: ఎల్ఐసీ పాలసీదారులు అలర్ట్.. ఐపీవోలో పెట్టుబడి పెట్టాలంటే ఇవి తప్పనిసరి..

Viral Photo: ఆశ్చర్యం.. పులి నిజంగానే నవ్వుతుందా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైగర్ ఫొటో..?

Pakistan Cricketer: గుజరాత్‌లో జన్మించిన పాకిస్తాన్ క్రికెటర్ మృతి.. అతడి నలుగురు సోదరులు క్రికెటర్లే..?