Weight Loss: 30 రోజుల్లో సులువుగా 5 కిలోలు తగ్గవచ్చు.. ఈ డైట్ పాటిస్తే అది సాధ్యమే..?
Weight Loss: మారిన జీవనశైలి, సమయపాలన లేని తిండి అలవాట్ల వల్ల చాలమంది బరువు విపరీతంగా పెరుగుతున్నారు. ఊబకాయం బారిన పడుతున్నారు.
Weight Loss: మారిన జీవనశైలి, సమయపాలన లేని తిండి అలవాట్ల వల్ల చాలమంది బరువు విపరీతంగా పెరుగుతున్నారు. ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే బరువు తగ్గడానికి తిండి మానేయడం సరైన పద్దతి కాదు. ఆహారంలో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. బరువు తగ్గడానికి ఇంటి నివారణలను కూడా ఆశ్రయించవచ్చు. ఈ రోజు అలాంటి డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. 30 రోజుల్లో సుమారు 5 కిలోల బరువు సులువుగా తగ్గవచ్చు. క్రమం తప్పకుండా ఈ ప్లాన్‌ను అనుసరించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.
30 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?
30 రోజుల్లో సుమారు 5 కిలోల బరువు సులువుగా తగ్గవచ్చు. కానీ ఒక్కొక్కరి శరీరం, ఆరోగ్య పరిస్థితులు ఒక్కో విధంగా ఉంటాయి. కాబట్టి ఈ డైట్ ప్లాన్‌ను అనుసరించే ముందు తప్పనిసరిగా నిపుణుల అభిప్రాయం తీసుకోవాలి. బరువు తగ్గించే డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం.
మొదటి వారం
1. ఉదయం సాంబార్‌తో 2 ఇడ్లీలు, 4 బాదంపప్పులు, గ్రీన్ టీ.
2. తర్వాత ఖచ్చితంగా కొన్ని పండ్లు తినాలి.
3. మధ్యాహ్న భోజనం పప్పు, 2 రోటీలు కొంత సమయం తర్వాత మజ్జిగ.
4. సాయంత్రం మూంగ్ పప్పు, మొలకలు తినవచ్చు.
5. రాత్రి భోజనం కూరగాయలతో 2 రోటీలు, పెరుగు, సలాడ్.
రెండో వారం
1. ఉదయం నిద్ర లేవగానే మెంతుల నీరు తాగాలి.
2. 2 క్రీప్స్ మూంగ్ పప్పు, 4 బాదం, గ్రీన్ టీ.
3. మధ్యాహ్న భోజనం మధ్య కాలానుగుణ పండ్లను తినాలి.
4. మధ్యాహ్న భోజనం కూరగాయల సలాడ్, పెరుగుతో 2 రోటీలు.
5. డీహైడ్రేషన్‌ను నివారించడానికి కొబ్బరి నీళ్లు తాగాలి.
6. రాత్రి భోజనం పుట్టగొడుగులు, 2 రోటీలు, బచ్చలికూర.
మూడో వారం
1. ఉదయం నిద్ర లేవగానే నిమ్మరసం తాగాలి.
2. ఒక కప్పు వెజిటబుల్ ఓట్స్, 4 బాదం, గ్రీన్ టీ.
3. మధ్యాహ్న భోజనం మధ్య పండ్ల రసం తాగాలి.
4. మధ్యాహ్న భోజనం రాజ్మా, 1 రోటీ, పావు గ్లాసు అన్నం, పెరుగు.
5. రాత్రి భోజనం పప్పు, 2 రోటీలు, సలాడ్.
నాలుగో వారం
1. ఉదయం నిద్ర లేవగానే నిమ్మరసం తాగాలి.
2. ఉప్మా, 2 బాదం, గ్రీన్ టీ.
3. మధ్యాహ్న భోజనం మధ్య కాలానుగుణ పండ్లను తినాలి.
4. మధ్యాహ్న భోజనం కూరగాయలు, సలాడ్, పెరుగుతో 2 రోటీలు.
5. కొన్ని గంటల తర్వాత కొబ్బరి నీళ్లు తాగాలి.
6. రాత్రి భోజనం పప్పు, 1 రోటీ, తక్కువ నూనెతో చేసిన కూరగాయల కర్రీ.