Arthritis: కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ నాలుగు పనులు చేస్తే మాయం..?

Arthritis: వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో కీళ్ల నొప్పులు మొదలవుతాయి. ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. మీరు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందాలనుకుంటే

Arthritis: కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ నాలుగు పనులు చేస్తే మాయం..?
Arthritis
Follow us
uppula Raju

|

Updated on: Feb 15, 2022 | 9:53 AM

Arthritis: వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో కీళ్ల నొప్పులు మొదలవుతాయి. ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. మీరు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలను నిత్యం ఆహారంలో తీసుకునే వారికి కీళ్లనొప్పులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అనేక పరిశోధనల్లో తేలింది. ఇది కాకుండా కీళ్ల నొప్పులకు సహజ నివారణలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ వ్యాధి చికిత్సలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే తులసి సహజ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని నూనెని తయారు చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం దొరుకుతుంది. ఇంకా ఈ 4 పద్దతులు పాటించండి.

1. హాట్ అండ్ కోల్డ్ థెరపీ

హాట్ అండ్ కోల్డ్ థెరపీ కీళ్ల నొప్పులకు చాలా విశ్రాంతినిస్తుంది. ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో ఎప్సమ్ సాల్ట్ వేయాలి. ఈ నీటిలో మీ పాదాలను 10 నుంచి 15 నిమిషాలు పెట్టాలి. ఈ సమయంలో పాదాలను తేలికగా రుద్దుతూ ఉంటే నీటి వేడి, మసాజ్ చర్మం రంధ్రాలను తెరుస్తుంది. ఎప్సమ్ సాల్ట్ శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను బయటకు తీస్తుంది. తరువాత చేతులు, మోచేతులను ముంచండి. నీరు వేడిగా ఉండేలా చూసుకోండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత మీ చేతులను తుడవండి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

2. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు

సరైన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఆహారంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను చేర్చాలి. ఇందులో ఉండే కొవ్వు ఆర్థరైటిస్ నొప్పికి ఉపయోగపడుతుంది. చేప నూనెలో ఒమేగా-3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వారానికి ఒక్కసారైనా తింటే ఆరోగ్యానికి మంచిది.

3. కఠిన వ్యాయామం

మీరు ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత ప్రయోజనం. వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల కీళ్లలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పరుగుతో పాటు ఏరోబిక్, స్విమ్మింగ్ కూడా చేయవచ్చు.

4. బరువు తగ్గండి

కీళ్ల నొప్పులు రావడంలో పెరిగిన బరువు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అధిక బరువు కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. బరువు పెరగడం వల్ల ముఖ్యంగా మోకాళ్లు, అరికాళ్లు, తుంటిలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, మీరు కీళ్ల నొప్పులను వదిలించుకోవాలనుకుంటే బరువును తగ్గించుకుంటే మంచిది.

Weight Loss: 30 రోజుల్లో సులువుగా 5 కిలోలు తగ్గవచ్చు.. ఈ డైట్ పాటిస్తే అది సాధ్యమే..?

Ashwagandha: అశ్వగంధతో అద్భుత ప్రయోజనాలు.. ఈ వ్యాధులను నయం చేయడంలో సూపర్..

LIC IPO: ఎల్ఐసీ పాలసీదారులు అలర్ట్.. ఐపీవోలో పెట్టుబడి పెట్టాలంటే ఇవి తప్పనిసరి..?

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!