Tarisai Musakanda: యాక్సిడెంట్ చేసిన క్రికెటర్.. టెన్నిస్ ప్లేయర్ మృతి..

Tarisai Musakanda: జింబాబ్వే క్రికెట్ ప్లేయర్ తరిసాయ్ మసకంద కష్టాల్లో చిక్కుకున్నాడు. అనుకోకుండా ఒక వ్యక్తిని కారుతో ఢీ కొట్టాడు. ఆ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లినా

Tarisai Musakanda: యాక్సిడెంట్ చేసిన క్రికెటర్.. టెన్నిస్ ప్లేయర్ మృతి..
Tarisai Musakanda
Follow us
uppula Raju

|

Updated on: Feb 15, 2022 | 1:38 PM

Tarisai Musakanda: జింబాబ్వే క్రికెట్ ప్లేయర్ తరిసాయ్ మసకంద కష్టాల్లో చిక్కుకున్నాడు. అనుకోకుండా ఒక వ్యక్తిని కారుతో ఢీ కొట్టాడు. ఆ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లినా రక్షించలేకపోయాడు. ఈ విషయాన్ని నిర్ణీత సమయంలో పోలీసులకు తెలపకపోవడంతో అతడిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కోర్టుకు కూడా హాజరు కావొచ్చు. మసకంద జనవరి 16వ తేదీ రాత్రి హరారేలో తన కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో అతడు కారుతో పాదాచారుడని ఢీ కొట్టాడు. అతడి పేరు గ్వినై చింగోకా అని చెప్పారు. అతడొక టెన్నిస్ ప్లేయర్. డేవిస్ కప్‌లో జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహించాడు. వయసు 38 సంవత్సరాలు. చింగోకా ఎడమ కాలు విరిగి, మోచేతి పగుళ్లతో బాధపడి జనవరి 27న ఆసుపత్రిలో మరణించాడని ESPNcricinfo వెబ్‌సైట్ పేర్కొంది.

24 గంటలైనా పోలీసులకు సమాచారం అందించలేదు..

మసకంద వెంటనే చింగోకాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే నిబంధనల ప్రకారం 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కానీ అలా చేయలేదు. చింగోకా మరణించిన తర్వాత మసకంద జనవరి 28న పోలీసులకు సమాచారం అందించాడు. చింగోక మృతికి రోడ్డు ప్రమాదమే కారణమని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. డ్రైవింగ్ కారణంగా మసకంద ఇబ్బందులు పడటం ఇదే మొదటిసారి కాదు. అతను జనవరి 2020లో ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాడు. అతడిని న్యూ సిటీ క్రికెట్ క్లబ్ మద్యం తాగి వాహనం నడిపినందుకు తొలగించింది కూడా.

ఈ 27 ఏళ్ల ఆటగాడు జింబాబ్వే తరఫున ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. తర్వాత 15 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. 12 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. జూలై 2021లో హరారేలో జింబాబ్వే తరపున చివరి T20 మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 134 పరుగులు చేశాడు. వన్డేల్లో బ్యాట్‌తో 304 పరుగులు చేశాడు. టీ20లో 197 పరుగులు చేశాడు. 2017లో శ్రీలంకపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకపైనే వన్డేల్లో అరంగేట్రం చేశాడు. టీ20లో పాకిస్థాన్‌తో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

Coconut Dosa: కొబ్బరి దోశ రుచి చూస్తే ఫిదా కావాల్సిందే.. ఇంట్లోనే ఇలా తయారుచేయండి..?

IPL 2022: ఈ 4 కోట్ల ఆల్‌రౌండర్‌పై ధోని ఎన్నో ఆశలు.. టీమిండియాలో చోటు లభిస్తుందా..?

LIC IPO: ఎల్ఐసీ IPOలో పెట్టుబడి పెడుతున్నారా.. కచ్చితంగా ఈ 10 విషయాలపై ఓ లుక్కేయండి..?

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత