IPL 2021: పర్పుల్ క్యాప్ రేసులో ఇప్పటికి అతడే నెంబర్ వన్.. మిగతావారి స్థానం ఎలా ఉందంటే..?
IPL 2021: దుబాయ్‌లో ఐపీఎల్ 2021 రెండోదశ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో ఒక బౌలర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు విధ్వంసం సృష్టిస్తూనే
IPL 2021: దుబాయ్‌లో ఐపీఎల్ 2021 రెండోదశ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో ఒక బౌలర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాడు. హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. అతడే రాయల్ ఛాలెంజర్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. ఇప్పటికే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిస సంగతి తెలిసిందే.
తాజాగా IPL 2021లో 50 వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో CSK ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత కూడా పర్పుల్ క్యాప్ రేసులో ఎటువంటి మార్పు లేదు. హర్షల్ పటేల్ అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నాడు. చాలా మంది బౌలర్లు అతడిని బీట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఎవ్వరికి అందకుండా మొదటి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్ కు చెందిన మహ్మద్ షమీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
హర్షల్ పటేల్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అవేశ్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. అతనికి, హర్షాల్ మధ్య వికెట్ల వ్యత్యాసం ఎక్కువగా ఉంది. ఐపిఎల్ ఆడే ప్రతి బౌలర్ అద్భుతంగా రాణిస్తూ తన జట్టును గెలిపించడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో పర్పుల్ క్యాప్ కోసం కూడా పోటీ పడుతారు. ఎందుకంటే ఐపిఎల్‌లో పర్పుల్ క్యాప్ ఒక్కటే ఎవ్వరికి ఏమీ చెప్పకుండా అతడి విజయగాధను తెలియజేస్తుంది. మొత్తం టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఈ క్యాప్‌ని పొందుతాడు. అలాగే టోర్నమెంట్ సమయంలో పర్పుల్ క్యాప్ పోటీదారులు తరుచూ మారుతూ ఉంటారు.
పర్పుల్ క్యాప్ టాప్ 5 బౌలర్లు
1. హర్షల్ పటేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 12 మ్యాచ్‌లు, 26 వికెట్లు 2. అవేష్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్) – 13 మ్యాచ్‌లు, 22 వికెట్లు 3. మహ్మద్ షమీ (పంజాబ్ కింగ్స్) – 13 మ్యాచ్‌లు, 18 వికెట్లు 4. జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) -12 మ్యాచ్‌లు, 17 వికెట్లు 5. అర్షదీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్) -11 మ్యాచ్‌లు16 వికెట్లు