IPL 2021: ఐపీఎల్‌ ఆరేంజ్‌ క్యాప్‌ రేస్‌..! కేఎల్ రాహుల్ కింగ్‌ ఆఫ్ ద నెంబర్‌ వన్‌..

IPL 2021: ఐపీఎల్‌ 2021 ఇప్పుడు తుది రౌండ్‌లోకి ప్రవేశించబోతోంది. ప్లేఆఫ్ కోసం ఇప్పటికే మూడు జట్లు ఎంపికయ్యాయి. మిగిలిన జట్లు చివరి స్లాట్ కోసం పోరాడుతున్నాయి.

IPL 2021: ఐపీఎల్‌ ఆరేంజ్‌ క్యాప్‌ రేస్‌..! కేఎల్ రాహుల్ కింగ్‌ ఆఫ్ ద నెంబర్‌ వన్‌..
Kl Rahul
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Oct 05, 2021 | 7:12 AM

IPL 2021: ఐపీఎల్‌ 2021 ఇప్పుడు తుది రౌండ్‌లోకి ప్రవేశించబోతోంది. ప్లేఆఫ్ కోసం ఇప్పటికే మూడు జట్లు ఎంపికయ్యాయి. మిగిలిన జట్లు చివరి స్లాట్ కోసం పోరాడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌లో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నాయి. ప్రతి మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించి తమ జట్టును గెలిపించాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు ఆటగాళ్ల కళ్లు ఆరెంజ్ క్యాప్‌పై కూడా ఉన్నాయి. ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్లకు ఆరెంజ్‌ క్యాప్ అతి పెద్ద బహుమతి. ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ రేసులో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్‌ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు.

ఎవరు ఈ టోపీని పొందుతారు ఆరెంజ్ క్యాప్ ఐపిఎల్‌లో బ్యాట్స్‌మెన్ విజయగాధను తెలియజేస్తుంది. ఎవరి తలపై ఈ టోపీ ఉంటుందో అతను IPLలో బ్యాటింగ్ కింగ్ అని అర్థం. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ తలపై ఆరెంజ్ క్యాప్‌ ఉంటుంది. ఆరెంజ్ క్యాప్ పోటి సిరీస్ లీగ్ నుంచే కొనసాగుతుంది. టోర్నమెంట్ సమయంలో ఈ టోపీ వివిధ బ్యాట్స్‌మన్‌ల తలలపై కనిపిస్తూ ఉంటుంది. చివరిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లకు కేటాయిస్తారు. ఈ టోపీని సాధించడం అంటే ఐపిఎల్ సీజన్‌లో బ్యాట్స్‌మన్ సూపర్‌హిట్ అని అర్థం.

గతసారి రాహుల్ గెలిచాడు.. ఈసారి ఎవరు? ప్రతి సీజన్‌లో వేర్వేరు బ్యాట్స్‌మెన్‌లు ఈ క్యాప్‌ని పొందుతున్నారు. ఐపిఎల్ 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 670 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం కూడా అతను ఆరెంజ్ క్యాప్‌ రేసులో ఉన్నాడు. అతనితో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రితురాజ్ గైక్వాడ్ కూడా ఈ రేసులో ఉన్నాడు. లీగ్ ముగింపులో ఈ టోపి ఎవరు పొందుతారనేది తెలుస్తుంది. 48 మ్యాచ్‌ల తర్వాత, ఆరెంజ్ క్యాప్‌ రేస్‌ ఈ విధంగా ఉంది.

1. KL రాహుల్ (PBKS) – 12 మ్యాచ్‌లు, 528 పరుగులు 2. రితురాజ్ గైక్వాడ్ (CSK) – 12 మ్యాచ్‌లు, 521 పరుగులు 3. శిఖర్ ధావన్ (DC) – 13 మ్యాచ్‌లు, 501 పరుగులు 4. సంజు శాంసన్ (RR) – 12 మ్యాచ్‌లు, 480 పరుగులు 5. ఫాఫ్ డు ప్లెసిస్ (CSK) – 13 మ్యాచ్‌లు, 470 పరుగులు

DC vs CSK, IPL 2021: ఉత్కంఠ మ్యాచ్‌లో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం.. రాణించిన శిఖర్ ధావన్‌..

Pandora Papers: పాండోరా పేపర్స్‌లో ప్రముఖుల రహస్య సంపద గుట్టు రట్టు.. దర్యాప్తుకు సిద్ధమైన కేంద్రం