Team India: ‘ఇతరుల విజయాన్ని చూసి నాకు ఈర్ష్య కలగదంటూ’.. పాక్ మాజీ క్రికెటర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన పేస్ బౌలర్
ఇండియన్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ పాకిస్తాన్ మాజీ క్రికెట్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డాడు. వన్టే వరల్డ్ కప్ 2023లో భారత బౌలర్లకు ఐసీసీ ప్రత్యేక బాల్స్ అందించిందని నిరాధారమైన వ్యాఖ్యలపై మండిపడ్డాడు. అవి కేవలం నిరాధారమైన మాటలే తప్ప ఎలాంటి ఆధారాలు లేవని చెప్పాడు. ఇలా విచక్షణా రహితంగా మాట్లాడటం మంచిది కాదని బుద్ది చెప్పాడు. మీకు మీరే గొప్పవాళ్లనుకోవడం సరిపోదని చురకలంటించాడు.

ఇండియన్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ పాకిస్తాన్ మాజీ క్రికెట్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డాడు. వన్టే వరల్డ్ కప్ 2023లో భారత బౌలర్లకు ఐసీసీ ప్రత్యేక బాల్స్ అందించిందని నిరాధారమైన వ్యాఖ్యలపై మండిపడ్డాడు. అవి కేవలం నిరాధారమైన మాటలే తప్ప ఎలాంటి ఆధారాలు లేవని చెప్పాడు. ఇలా విచక్షణా రహితంగా మాట్లాడటం మంచిది కాదని బుద్ది చెప్పాడు. మీకు మీరే గొప్పవాళ్లనుకోవడం సరిపోదని చురకలంటించాడు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండని హెచ్చరించారు.
మన్నటి వరకూ జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ తీవ్రంగా శ్రమించి విజయానికి ఒక అడుగు దూరంలో నిలిచి ఓటమి పాలైంది. ఎన్నడూ లేని విధంగా పేస్ బౌలర్లు చలరేగి ఆడారు. మొత్తం ప్రపంచ కప్ టోర్నీలో ముగ్గురు పేసర్లు 58వికెట్లు పడగొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. షమీ 24 వికెట్లు తీయగా.. బుమ్రా 20 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక సిరాజ్ 14 వికెట్లు తీసి మూడవ స్థానంలో నిలిచారు. ఈ టోర్నిలో పాక్ ఘోర పరాజయానికి గురికావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ అక్కస్సు మొత్తం ఇలా ఏదో ఒక దానిపై నెట్టి విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని వివరించాడు.
పాక్ మాజీ క్రికెటర్ హసన్ రాజా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంపై షమీ స్పందించాడు. ఇతరుల విజయాన్ని చూసినప్పుడు నాకు ఈర్ష్య కలగదని ఎక్స్ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఇతరుల విజయాన్ని కూడా ఆనందంగా పంచుకోగలిగినప్పుడే మంచి ఆటగాడు అనిపించుకుంటాడని తెలిపాడు. కుట్రలకు, రాజకీయాలకు మూలం పాకిస్తానీలే అంటూ విమర్శించాడు. పాకిస్తాన్ మాజీ క్రికెట్ ఆటగాళ్లలో తమకు తామే గొప్పవాళ్ళమని భావిస్తూ ఉంటారు. వేరే వాళ్లు సాధించిన విజయాలను గుర్తులోకి తెచ్చుకోరని ఈ వీడియోలో వివరించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




