బెజవాడ దుర్గమ్మ సేవలో ఇంగ్లండ్ అండర్ 19 క్రికెట్ జట్టు.. కింద కూర్చోలేక ముప్పు తిప్పలు.. వీడియో..
England Under-19 Cricket Team: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని ఇంగ్లండ్ యువ క్రికెటర్లు దర్శించుకున్నారు. 19 మంది జట్టు ఆటగాళ్లు మంగళవారం ఉదయం కనకదుర్గమ్మ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వారికి ఆలయ చిత్రపటం, లడ్డూప్రసాదాలు అందజేశారు.
England Under-19 Cricket Team: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని ఇంగ్లండ్ యువ క్రికెటర్లు దర్శించుకున్నారు. 19 మంది జట్టు ఆటగాళ్లు మంగళవారం ఉదయం కనకదుర్గమ్మ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వారికి ఆలయ చిత్రపటం, లడ్డూప్రసాదాలు అందజేశారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు అమ్మవారిని దర్శించుకున్న క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇంద్రకీలాద్రి అమ్మవారు సన్నిధిలో ఇంగ్లాండ్ క్రికెటర్లు కింద కూర్చోలేక ముప్పుతిప్పలు పడ్డారు. కింద కూర్చొడం అలవాటు లేకపోవడంతో వారంతా ఇబ్బంది పడుతూ కనిపించారు.
భారతదేశంలో వన్డే సిరీస్ అడేందుకు ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ వన్డే సిరీస్లో భారత్ నుంచి రెండు టీమ్స్ ఆడుతుండగా.. ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు బరీలో ఉన్నాయి. అన్ని మ్యాచ్‌లూ మూలపాడు మైదానంలోనే జరుగుతున్నాయి. అయితే, కాగా భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ టీమ్, దుర్గమ్మ సేవలో లీనం అయారు. భారత్, ఇంగ్లండ్ జట్లులు చెరో 2 మ్యాచ్లు నెగ్గాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..