AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi : మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.. ఈసారి మరింత పవర్ ఫుల్‌గా

రీసెంట్ గా శివకార్తికేయన్‌తో కలిసి అమరన్‌ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత తదుపరి సినిమా గురించిన సమాచారం ఇప్పుడు వైరల్ అవుతోంది. సాయి పల్లవి ధామ్ ధూమ్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత మలయాళంలో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా మారింది.

Sai Pallavi : మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.. ఈసారి మరింత పవర్ ఫుల్‌గా
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2024 | 7:39 AM

Share

ప్రేమమ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి పల్లవి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిన్నది. ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇటీవలే అమరన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి మరోసారి తన నటనతో కట్టిపడేసింది. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ అమరన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో సాయి పల్లవి స్టార్ డమ్ మరింత పెరిగింది.

ఇక ఇప్పుడు హిందీలోకి కూడా అడుగుపెడుతుంది. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ రామాయణం లో సీతగా సాయి పల్లవి నటించనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఆ మధ్య సాయి పల్లవి , రణబీర్ కపూర్ ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే తెలుగులో ఈ చిన్నది తండేల్ అనే సినిమా చేస్తుంది. తండేల్ మూవీలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది.

గతంలో నాగచైతన్య , సాయి పల్లవి కాంబినేషన్ లో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి మరో ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. బలగం సినిమాతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న వేణు ఎల్దండి దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా రానుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడని తెలుస్తుంది. ముందుగా ఈ మూవీలో నాని హీరో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆఛాన్స్ నితిన్ కు వెళ్లిందని తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని సెలక్ట్ చేసుకున్నారని తెలుస్తుంది. సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా అద్భుతంగా సెట్ అవుతుంది. ఫిదా, లవ్ స్టోరీ సినిమాల్లో అచ్చం తెలంగాణ అమ్మాయిలా నటించి మెప్పించింది. దాంతో సాయి పల్లవి అయితే ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావించి ఆమెను ఎంపిక చేశారని తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!