Viral Video: వాయమ్మో.! ఎంత పే.. ద్ద కొండచిలువ.. ఏం చేసిందో చూశారా
సరీసృపాలలో ఎన్నో జాతులు ఉంటాయి. కింగ్ కోబ్రా నుంచి భారీ కొండచిలువలు వరకు భారీగా ఉండేవి కూడా ఉన్నాయి. ఇక కాయంలోనూ అటు పొడవులోనూ కొండచిలువలు భారీగా ఉంటాయి. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆ వివరాలు..
సరీసృపాలలో ఎన్నో రకాల జాతులు ఉన్నాయి. వీటిల్లో అత్యంత విషపూరితమైనది కింగ్ కోబ్రా కాగా.. అనకొండ భారీ కాయంతో, అత్యంత పొడవుగా ఉంటుంది. ఇక భారతదేశంలో సుమారు 350 రకాల పాములు కనిపిస్తాయి. కోబ్రా, రసుల్ వైపర్, ఎగిరే పాము, జెర్రిపోతు, క్రెయిట్ పాము, రెడ్ సాండ్ బో, ర్యాట్ స్నేక్, క్యాట్ స్నేక్.. ఇలా ఇండియాలో కనిపించే పాములన్నీ కూడా విషపూరితమైనవే. నెట్టింట ఈ సరీసృపాలకు సంబంధించిన వీడియోలు చాలానే వైరల్ అవుతుంటాయి. వీటిపై నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తారు కూడా. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మీరూ దాన్ని చూస్తే షాక్ కావడం ఖాయం.
ఈ వైరల్ వీడియోను మాజీ అటవీశాఖ సుశాంత్ నందా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ వీడియోలో ఓ భారీ కొండచిలువ తన తలను పైకి ఎత్తి చెట్టు పైకి ఎగబాకుతున్నట్టు మీరు చూడవచ్చు. అది ఏదో ఎరను మిగినట్టుగా తన పొట్ట ఉబ్బి ఉంది. ఈ వీడియో ఎక్కడ తీశారు.? ఎప్పుడు తీశారు.? అనేది తెలియాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఈ వీడియో షేక్ చేస్తోంది.
Another day in the wilderness of India💕 ( so huge that fits into the record book) pic.twitter.com/2W9u81tCbP
— Susanta Nanda (@susantananda3) December 26, 2024
సాధారణంగా కొండచిలువలు బరువులో భారీగా ఉండటమే కాదు.. పొడవు కూడా ఎక్కువే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎనిమిదో పాము జాతులకు చెందిన ఈ కొండచిలువ.. సుమారు 6 మీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. ఇవి విషపూరితమైనవి కాదు గానీ.. తనకు హని చేసే ఎర ఎంత పెద్దదైనా కూడా అమాంతం మింగేయగలవు. లేట్ ఎందుకు మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇది చదవండి: పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి