Gold Tea: ఈ చాయ్ ధర రూ.1 లక్షకుపైనే.. ఈ టీ కప్పు రహస్యం ఏంటి.. ఈ గోల్డ్ స్ట్రాంగ్ టీ ఎక్కడ దొరుకుతుంది?
Gold Tea: చాయ్ అంటే చాలా మందికి అదో ఒక ఎమోషనల్ లా ఫీల్ అవుతూ ఉంటారు. మరెంతో మందికి చాయ్ లేనిదే రోజు స్టార్ట్ కాదు. ఫ్రెండ్స్ తో బయటికెళ్లినా, ఫ్యామిలీతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నా చాలా మందికి గుర్తొచ్చేది చాయే. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న చాయ్ ధర ఎంతుంటుంది..
భారతదేశంలో టీకి భిన్నమైన క్రేజ్ ఉంది. రోజువారీ జీవితంలో టీ అనేది తప్పనిసరిగ్గా మారింది. టీ లేనిది రోజు గడపని వారు ఎందరో ఉన్నారు. అయితే ఒక కప్పు టీకి ఎంత చెల్లించాలి? భారతదేశంలో టీ తాగుతుంటే టీకి సాధారణ ఛార్జీ రూ. 10, రూ. 20. అదే మీరు ఫైవ్ స్టార్ హోటల్‌లో తాగాలనుకుంటే కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. అది కూడా రూ. 500-600. కాగా, ఇండియన్ కేఫ్‌లో కప్పు టీ ధర లక్ష రూపాయలు. సోషల్ మీడియాలో కూడా ఈ టీకి క్రేజ్ పెరుగుతూనే ఉంది.
వెండి కప్పులో టీ అందిస్తారు
ఈ కేఫ్ పేరు బోహో కేఫ్. దీని యజమాని సుచేతా శర్మ. AED 5000 అంటే మన కరెన్సీలో సుమారు 1.14 లక్షలన్నమాట. ఈ టీ 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసి, స్వచ్ఛమైన వెండి కప్పులో సర్వ్ చేస్తారు. టీ తాగాక కస్టమర్లు ఈ కప్పును తమ వద్ద ఉంచుకోవచ్చట. ఇదే కాదు ఇక్కడి మెనులోని ఇతర ప్రీమియం ఐటెమ్‌లలో గోల్డ్ సావనీర్ కాఫీ, గోల్డ్ డస్టెడ్ క్రోసెంట్స్, గోల్డ్ డ్రింక్స్, గోల్డ్ ఐస్ క్రీం వంటి వెరైటీ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఈ టీని వెండి కప్పులో పోసి, 24 క్యారట్ల గోల్డ్ రేకుతో అలంకరిస్తారు. ఈ కేఫ్‌కు యజమాని ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కావడం విశేషం. అంతేకాకుండా ఈ మెనులోని ఇతర ప్రీమియం ఐటెమ్‌లలో గోల్డ్ సావనీర్ కాఫీ, గోల్డ్ డస్టెడ్ క్రోసెంట్స్, గోల్డ్ డ్రింక్స్ మరియు గోల్డ్ ఐస్ క్రీం కూడా ఉన్నాయి అని ఖలీజ్ టైమ్స్ నివేదించింది.
లగ్జరీని ఇష్టపడే వారి కోసం డిఫరెంట్‌గా క్రియేట్ చేయాలనుకున్నాం’’ అని సుచేతా శర్మ తెలిపారు. వారి ‘రాయల్ మెనూ’లోని ఇతర ఆఫర్‌లలో గోల్డ్ సావనీర్ కాఫీ, వెండి పాత్రలో అందిస్తున్నాం. కస్టమర్లు ఇంటికి కూడా తీసుకెళ్లవచ్చు. దీని ధర AED 5000 (సుమారు INR 1.14 లక్షలు). ఈ టీపైనా బంగారం పొడి చల్లుతారు. చివర్లో ఈ కప్పులు, పళ్లేలను వినియోగదారులు తీసుకెళ్లిపోవచ్చు. ఈ రాయల్ మెనూలో ‘గోల్డ్ సావరిన్ కాఫీ’ కూడా ఉంది. దీని ధర 4,761 దిర్హామ్‌లు (రూ.1,09 లక్షలు). దీన్ని కూడా వెండి కప్పుల్లో ఇస్తారు. ఆ కప్పులను కూడా ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇవి కాకుండా బంగారం ఐస్‌క్రీమ్‌లు, డ్రింకులు కూడా లభిస్తాయి. ‘విలాసాలు కోరుకునే వారికి ఏదైనా అసాధారణమైనది చేయాలనుకున్నాం. అందుకే వీటిని అందిస్తున్నాం’ అని సుచేత శర్మ చెప్పారు.
View this post on Instagram
సోషల్ మీడియాలో రియాక్షన్స్ ఎలాగంటే..
ఈ కేఫ్ వీడియోను ఫుడ్ వ్లాగర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో అతను టీ గురించి అన్ని ప్రత్యేక విషయాలను చెప్పాడు. దీని తరువాత ప్రజలు సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. “నేను ‘బ్రదర్, మీరు టీ తాగడానికి EMI తీసుకోవలసి ఉంటుంది’ అని వ్యాఖ్యానించాడు. మరో వినియోగదారు ఇలా చెప్పుకొచ్చాడు.”ఇది దోపిడీ. వెండి వస్తువులు, బంగారు పూతతో కూడిన వాటికి 700 AED కంటే ఎక్కువ ఖర్చు ఉండదు. దీనికి 5000 AED వసూలు చేయడం హాస్యాస్పదంగా ఉంది!” అన్నాడు.
ఇది కూడా చదవండి: Anil Ambani: అనిల్ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా..? దాని విలువ ఎంతంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి