AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?

Tech Tips: మొబైల్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఫోన్లు నీటిలో పడిపోవడం, లేదా వర్షంలో తడిసిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటి సమయంలో టెన్షన్‌ పడి తుడవడం, లేదా హీట్‌గా ఉన్న ప్రదేశంలో ఉంచడం లాంటి తప్పులు చేస్తుంటారు. మరి ఫోన్‌ నీటిలో పడితే ఏం చేయాలి? బియ్యంలో ఉంచితే మంచిదా..?

Tech Tips: నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
Subhash Goud
|

Updated on: Dec 27, 2024 | 8:40 PM

Share

ఫోన్ నీళ్లలో పడిపోవడం, తడవడం అన్నీ సాధారణ సంఘటనలే. అందుకే ఇప్పుడు వస్తున్న చాలా స్మార్ట్ ఫోన్లు వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో వస్తున్నాయి. అయినా కూడా ఫోన్ నీటిలో పడితే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే ముందుగా ఫోన్ నీటిలో పడితే ఏం చేయాలో తెలుసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనలో చాలామంది చేసే మొదటి పని తడి ఫోన్‌ను బియ్యంలో పెట్టడం. అయితే ఇలా చేయడం సరైనదేనా? ఇది ప్రయోజనకరంగా ఉంటుందా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

తడి ఫోన్ బియ్యంలో ఉంచవచ్చా?

ఫోన్ నీటిలో పడితే, ముందుగా, మీరు దాని నుండి నీరు, తేమను ఒక గుడ్డతో తుడిచివేయాలి. ఆ తర్వాత, ఫోన్‌ను కంటైనర్‌లో లేదా బ్యాగ్‌లో భద్రపరచడం చాలా ముఖ్యం. బియ్యంలో ఉంచడం వల్ల ఫోన్ లోని నీటిని పూర్తిగా పీల్చుకుంటుందన్నారు. అయితే ఫోన్‌ని బియ్యం లోపల కనీసం ఆరు గంటల పాటు నిల్వ ఉంచాలి.

అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు వారి ఫోన్‌లను బియ్యంలో నిల్వ చేయవద్దని ఒక సూచనతో ముందుకు వచ్చింది. దీని వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువ అని యాపిల్ హెచ్చరించింది. ఫోన్ లో నీరు రాకుండా ఉండేందుకు బియ్యంలో బియ్యాన్ని నిల్వ ఉంచితే బియ్యంలోని చిన్న చిన్న పదార్థాలు ఫోన్ లోకి చేరి ఫోన్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ తెలిపింది. అయితే, ఇతర ప్రధాన ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు ఎవరూ ఈ విషయంలో హెచ్చరికతో ముందుకు రాకపోవడంతో చాలా మంది ఇప్పటికీ ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.

ఫోన్ నీటిలో పడితే ముందుగా ఏం చేయాలి?

  1. నీటిలో పడిపోయిన ఫోన్‌ను వెంటనే ఆన్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. నీటిలో పడిన తర్వాత ఫోన్ ఆఫ్ కాకపోతే వెంటనే ఆఫ్ చేయండి.
  2. ఫోన్ బటన్లను అనవసరంగా నొక్కకండి. అలాగే, నీటిని నివారించేందుకు ఫోన్‌ను షేక్ చేయవద్దు లేదా స్ప్లాష్ చేయవద్దు.
  3. ఫోన్‌ను ఆఫ్ చేసిన తర్వాత SIM కార్డ్, మైక్రో SD కార్డ్ మొదలైనవాటిని తీసివేయండి.
  4. ఫోన్‌లోని నీటిని బయటకు తీయడానికి ఛార్జర్ పాయింట్‌పై ఊదకండి. దీని వల్ల లోపల నీరు ఇంకిపోతుంది.
  5. మీరు ఒక గుడ్డతో ఫోన్ నుండి నీటిని తుడవవచ్చు. హెయిర్ డ్రైయర్, మైక్రోవేవ్‌తో ఫోన్‌ను వేడి చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు.
  6. ఫోన్ సరిగ్గా పని చేయకపోతే మొబైల్ రిపేర్‌ సెంటర్‌లు, లేదా షోరూమ్‌లకు తీసుకెళ్లండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి