AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Tools: ఏఐ ద్వారా మోసాలకు అడ్డుకట్ట.. కేంద్రం కీలక చర్యలు

AI Tools: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. వినియోగదారుల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు..

AI Tools: ఏఐ ద్వారా మోసాలకు అడ్డుకట్ట.. కేంద్రం కీలక చర్యలు
Ashok Bheemanapalli
| Edited By: Subhash Goud|

Updated on: Dec 27, 2024 | 2:57 PM

Share

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అందిరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏ అవసరం వచ్చినా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏఐ టూల్స్‌నే ఆశ్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఈ-కామర్స్ మోసాల నుంచి రక్షించడానికి భారతదేశ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఏఐ టూల్స్ ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయనుంది.

ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వినియోగదారుల రక్షణను బలోపేతం చేయడానికి అనేక రక్షణ చర్యలను తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హెల్ప్‌లైన్, మోసపూరిత మార్కెటింగ్ పద్ధతులను గుర్తించే సాధనాలు అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా ప్రధాన ఈ-కామర్స్ కంపెనీలు ఆన్‌లైన్ షాపింగ్ భద్రతను పెంచే విధంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఏఐ ఎనేబుల్డ్ నేషనల్ కన్య్జూమర్ హెల్ప్‌లైన్, ఈ-మ్యాప్ పోర్టల్, జాగో గ్రాహక్ జాగో మొబైల్ అప్లికేషన్ వంటి నూతన వినియోగదారుల రక్షణ చర్యలను ప్రభుత్వం రూపొందించింది. దీంతో ప్రముఖ కంపెనీలైన రిలయన్స్ రిటైల్, టాటా సన్స్, జొమాటోతో సహా ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు ఈ భద్రతా చర్యలను తమ యాప్స్‌లో అందిస్తామని పేర్కొన్నారు. వినియోగదారుల వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించామని జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి జోషి అన్నారు.

ఈ ఏడాది జనవరి నవంబర్ మధ్య జాతీయ కమిషన్‌లో దాఖలైన 3,628 కేసులలో 6,587 కేసులను దేశంలోని త్రీ-టైర్ వినియోగదారుల కోర్టు వ్యవస్థ ద్వారా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఈ-దాఖిల్ పోర్టల్ 2020లో ప్రారంభించారు. జూన్ 2023లో దేశవ్యాప్తంగా విస్తరించారు. కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలతో పాటు అనేక జిల్లాల్లో ఆన్‌లైన్ ఫిర్యాదుల కోసం 100 శాతం స్వీకరణను సాధించింది.

పెరుగుతున్న ఈ-కామర్స్ కొనుగోళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నప్పటికీ, వినియోగదారుల భద్రత, మోసాలకు అడ్డుకట్ట వేయడమే తమ లక్ష్యమని మంత్రి జోషి పేర్కొన్నారు. ముఖ్యంగా సరోగేట్ ప్రకటనలను నియంత్రించేందుకు ఇటీవల వినియోగదారుల రక్షణ అథారిటీ (సీపీపీఏ) కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ఇప్పటికే ఉన్న నిబంధనలను పాటించని 13 కంపెనీలకు నోటీసులు జారీ చేసిందని, వినియోగదారుల రక్షణే ముఖ్యమని వివరించారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి