Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు: ఉత్తర్వులు జారీ!

School Holidays: పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులకు పండగే. ఇక ఏకంగా 15 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తే వారి ఆనందానికి హద్దు ఉండదు. దేశంలో చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగిపోతోంది. చలి కారణంగా విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం..

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు: ఉత్తర్వులు జారీ!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 28, 2024 | 2:28 PM

విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే ఎగిరి గంతేస్తుంటారు. ఇక దేశంలో చలి తీవ్రత కూడా పెరిగిపోతోంది. ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగిపోయింది.

ఇక విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. దీంతో హర్యానా సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ విపరీతమైన చలి ఉండటంతో ఏకంగా రెండు వారాల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌, అంగన్‌వాడీ కేంద్రాలను సైతం మూసివేయాలని ప్రకటించింది హర్యానా ప్రభుత్వం. రాష్ట్రంలో తీవ్రమైన చలికాల పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా హర్యానా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ, ప్రైవేట్-ఎయిడెడ్ పాఠశాలల పాఠశాల సమయాలను ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటలకు మార్చారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పిల్లలను చలి నుంచి కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 16వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.

ఇదిలా ఉండగా, చలికాలంలో విద్యార్థులు ఎక్కువగా అనారోగ్యం బారినపడి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టు ప్రభుత్వం వివరించింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ సహా ప్రయివేట్ విద్యా సంస్థలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను తప్పనిసరిగా అనుసరించాలని పాఠశాలల యాజమాన్యాన్ని విద్యాశాఖ కోరింది. అయితే బోర్డు పరీక్షలు రాసే 10, 12వ తరగతుల విద్యార్థులను ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించారు.

Haryana

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి