Viral: బ్యాంకులో తనఖా పెట్టిన బంగారాన్ని చెక్ చేయగా.. తెల్లారి ఊహించని ట్విస్ట్
తాను పనిచేసే బ్యాంకుకే కన్నం వేశాడు ఓ కేటుగాడు. ఓ వ్యక్తి గ్రామీణ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పని చేస్తున్నాడు. అరకేజీ బంగారు ఆభరణాలు తనఖా పెట్టాడు. ఇక ఓ రోజు బ్యాంకు మేనేజర్ వాటిని పరిశీలించగా.. దెబ్బకు షాక్ అయ్యాడు.
నకిలీ బంగారు ఆభరణాలతో కర్ణాటక గ్రామీణ బ్యాంకుకు రూ. 21 లక్షలకు పైగా టోకరా వేశాడు ఓ ఫేక్ జ్యువలరీ అప్రైజర్. ఈ విషయం బ్యాంక్ మేనేజర్ దృష్టికి రావడంతో.. ఘటనపై నెలమంగళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు నిందితుడు. వివరాల్లోకి వెళ్తే.. మంజునాథ్ అనే గోల్డ్ అప్రైజర్ అరకేజీ నకిలీ బంగారు ఆభరణాలను బ్యాంకులో వివిధ వ్యక్తుల పేర్ల మీద తనఖా పెట్టి.. సుమారు రూ. 21 లక్షలకు టోకరా వేశాడు. సదరు నిందితుడు ఆదర్ష్ అనే వ్యక్తి అకౌంట్‌లోకి రూ. 3 లక్షలు, లోకేష్ అనే వ్యక్తి అకౌంట్‌లో రూ. 4 లక్షలు, సుదర్శన్‌కి రూ. 3 లక్షలు, గిరీష్‌కు రూ. 5 లక్షలు, ఐశ్వర్యకు రూ. 3 లక్షలు, హరీష్ అనే వ్యక్తి ఖాతాలోకి రూ. 3 లక్షలు వేశాడు.
ఇక ఒకానొక సందర్భంలో బ్యాంక్ మేనేజర్ తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను పరిశీలించగా.. అవన్నీ నకిలీ బంగారు ఆభరణాలుగా తేలాయి. బ్యాంకు బుక్స్ ఆధారంగా ఈ తతంగం అంతా కూడా గోల్డ్ అప్రైజర్ ద్వారానే జరిగిందని గుర్తించాడు. నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి.. డబ్బు అంతటిని ఆరుగురి వ్యక్తుల ఖాతాల్లోకి విభజించి వేసినట్టు బ్యాంక్ మేనేజర్ దృష్టికి వచ్చింది. వెంటనే దీనిపై నెలమంగళ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. సదరు నిందితుడు డబ్బులు డిపాజిట్ చేసిన ఖాతాలు చెందిన వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది చదవండి: పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి