Viral News: లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
ఏదైనా సరే కావాల్సిన దానికి మించి ఉంటే అస్సలు విలువ తెలీదు. సాధారణంగా నెలకు సంబంధించిన కిరాణా సామాన్ల ధర పెరిగితేనే అమ్మో బాబోయ్ అంటాం. కానీ అందుకు మించి లెక్క లేకుండా డబ్బు ఉంటే ఇలానే పిచ్చి పీక్స్‌కి చేరుతుంది. కేవలం లిప్ స్టిక్ క్యారీ చేయడానికి రూ.27 లక్షలు ఖర్చు పెట్టి బ్యాగ్ తీసుకుంది ఈ అమ్మాయి..
కేవలం లిప్ స్టిక్, కాంపాక్ట్ పౌడర్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షలు పెట్టి ఓ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ కొన్నాది. తను హనీ మూన్ టైమ్‌లో పెట్టుకోవడానికి జస్ట్ ఓ 27 లక్షల రూపాయలు వెచ్చించి మరీ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. ఇది వినడానికి అతిశయోక్తిగా ఉన్నా.. ఇది అక్షరాల నిజం. డబ్బు ఉంటే ఎలాంటి పనులైనా జరుగుతాయి. ‘ధనం మూల ఇదం జగత్’ అన్నారు అందుకే పెద్దలు. ధనంలో ఎలాంటివైనా ఎలాంటి వారినైనా కొనేయవచ్చు. లిప్ట్ స్టిక్ కోసం ఏకంగా రూ.27 లక్షలు పెట్టి కొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒకింత షాక్‌కి గురవుతున్నారు. లిప్ స్టిక్ పెట్టుకోవడానికి ఏకంగా అంత డబ్బు పెట్టి సపరేట్‌గా బ్యాగ్ తీసుకోవాలా అని అయోమయానికి లోనవుతున్నారు.
ఈ వీడియోలో.. ఒక తల్లి, కూతులర్లు ఇద్దరూ ఐకానిక్ హెర్మేస్ కెల్లీ బ్యాగ్‌ని కొనుగోలు చేయడానికి వెళ్తారు. తన కూతురుకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని.. తను హనీమూన్ సమయంలో తన లిప్ స్టిక్, కాంపాక్ట్ తీసుకెళ్లడానికి స్టైలిష్‌గా ఉండే హ్యాండ్ బ్యాగ్ కావాలని అడుగుతుంది. దీంతో షాపులో ఉన్న మహిళ వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్, జ్యూయలరీకి తగినట్టుగా చిన్నగా, స్టైలిష్‌గా ఉండే అన్ని రంగుల హ్యాండ్ బ్యాగ్స్‌ని చూపిస్తుంది. అలాగే కలర్స్, రంగు, ఎలా తయారు చేస్తారో వివరిస్తుంది. ముందుగా తల్లి క్రీమ్ కలర్‌లో ఉండే హ్యాండ్ బ్యాంగ్ తీస్తే.. కూతురు మాత్రం తెలుపు రంగులో ఉండే హ్యాండ్ బ్యాగ్‌ని ఎంచుకుంటుంది. దీంతో వైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్‌ని ప్యాక్ చేస్తూ.. ఇది జస్ట్ రూ.27 లక్షలు అని చెబుతుంది. సరేనని వీడియోలో ఉండే తల్లీ కూతుర్లు డబ్బులు పే చేసి తీసుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది.
View this post on Instagram
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమన అభిప్రాలను పంచుకుంటున్నారు.. ‘డబ్బు ఉంటే పిచ్చి పీక్స్‌కి వెళ్తుందని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘అసలు పిచ్చి.. టూ మచ్ మరీ’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘బ్రాండెడ్ అయిన కెల్లీ బ్యాగ్‌ని సొంతం చేసుకోవాలని నా ఆశ.. దాని గురించి కలలు కంటున్నానని’ కొందరు కామెంట్ చేశారు. అంత ఖర్చు చేసి.. ‘లిప్ స్టిక్ కోసం అంత చిన్న బ్యాగ్ తీసుకోవడం అవసరమా’ అని మరొకరు.. ‘అక్కడ డబ్బులు మాత్రమే కనిపిస్తున్నాయి.. బ్యాగ్ లేదు’.. ‘అసలు ఆ బ్యాగ్స్ ఏమీ బాలేవు’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇలా వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయండి..