Viral: ట్రైన్ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
మరో 3 రోజుల్లో నూతన సంవత్సరం వస్తుంది. అప్పుడే అన్ని రాష్ట్రాల్లోనూ నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే కొందరు కేటుగాళ్లు మాత్రం తమ పంధా మార్చుకోలేదు. రాష్ట్ర సరిహద్దులను మాదకద్రవ్యాలు దాటించేందుకు క్రియేటివిటీని ఉపయోగిస్తున్నారు. అయితేనేం పోలీసులు తక్కువ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అసలే నూతన సంవత్సరం.. ఆపై ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు పెట్టి మరీ వాహనాలు తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఎలాంటి అవాంతర సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంలో అప్రమత్తమైంది పోలీసు యంత్రాంగం. అయితే కేటుగాళ్ల తీరు మాత్రం మారట్లేదు. ఈ సమయంలో రోడ్డు మార్గంలో మాదకద్రవ్యాలను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తే దొరికిపోతాం అని.. క్రియేటివిటీతో వేరే మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే రైలులో కిలోల కొద్దీ గంజాయి సరఫరా చేస్తోన్న ఎనిమిది మంది నిందితులను బెంగళూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. కోటి విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో బెంగళూరు పోలీసులు అప్రమత్తమై నగరాన్ని కలిపే హైవేలలోని చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తనిఖీలు చేపట్టారు. దీంతో పెడ్లర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఎవరూ పసిగట్టలేని విధంగా రైలులో గంజాయి సరఫరా సాగించారు. ప్రశాంతి, హతియా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేశారు. కానీ బెంగళూరు రైల్వే పోలీసులు.. ముఖ్యమైన ట్రైన్లలో తనిఖీలు చేపట్టగా.. నిందితుల వద్ద ట్రాలీ బ్యాగుల్లో గంజాయి లభ్యమైంది. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇది చదవండి: పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి