Tollywood: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. విడాకుల తర్వాత 7 ఏళ్లు చిన్నవాడితో డేటింగ్.. ఎవరంటే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో 2 జాతీయ అవార్డులు అందుకున్న నటి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఎక్కువగా పర్సనల్ విషయాలతో వార్తలలో నిలిచింది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావండ దగ్గర్నుంచి తనకంటే 7 ఏళ్లు చిన్నవాడితో డేటింగ్ చేయడం వరకు అనేక సార్లు ఆమె చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ వారి సినిమాల గురించి కాకుండా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా వార్తలలో నిలుస్తుంటారు. నటీమణుల ప్రేమ, పెళ్లి, విడాకులు, డేటింగ్.. ఇలా ఒక్కటేమిటీ హీరోయిన్స్ పర్సనల్ లైఫ్ పై నిత్యం ఏదోక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఓ హీరోయిన్ ప్రేమ జీవితం గురించి నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో హిట్ చిత్రాలను అందించిన ఈ భామ బాలీవుడ్ అగ్ర నటి. అంతే కాదు రెండు జాతీయ అవార్డులు కూడా అందుకుంది. కానీ ఇప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి చర్చలు జరుగుతుంటాయి. ఆమె మరెవరో కాదు.. కొంకణా సేన్ శర్మ.
కొంకణా సేన్ అనేక హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించి మెప్పించింది. 1983లో బెంగాలీ చిత్రం ‘ఇందిర’లో కొంకణ్ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 2001లో ‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’ అనే ఇంగ్లీష్ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి గానూ ఆమెకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. 2007లో ‘ఓంకార’లో ఇందు పాత్రను పోషించి మరింత ఫేమస్ అయ్యింది. ఈ పాత్రకు కొంకణ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది.
2007లో, ఆమె రణవీర్ షోరేతో డేటింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి. కొంకణ, రణవీర్ సెప్టెంబర్ 2010లో వివాహం చేసుకున్నారు. మార్చి 2011లో, కొంకణ సేన్ శర్మ హరూన్ అనే కొడుకుకు జన్మనిచ్చింది. వీరిద్దరు 2020లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం కొంకణా తనకంటే ఏడేళ్లు చిన్నవాడైన అమోల్ పరాశర్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ‘డాలీ కిట్టి ఔర్ వో చమతే సితారే’ చిత్రంలో నటించారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.