Unstoppable With NBK: మహేష్ నా చిన్న తమ్ముడు.. పవన్ వాటికోసం మా ఇంటికి వచ్చేవాడు.. బాలయ్య షోలో వెంకీ కబుర్లు

బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న అన్ స్టాపబుల్ సీజన్ 4 ఏడో ఎపిసోడ్ కు విక్టరీ వెంకటేశ్ అతిథిగా హాజరయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ షోకు విచ్చేశారు.వెంకటేష్ తో పాటు సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ షో సందడి చేశారు.

Unstoppable With NBK: మహేష్ నా చిన్న తమ్ముడు.. పవన్ వాటికోసం మా ఇంటికి వచ్చేవాడు.. బాలయ్య షోలో వెంకీ కబుర్లు
Unstoppable Show
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 28, 2024 | 8:14 AM

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇప్పుడు సీజన్ 4 తో అలరిస్తుంది. ఇక బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంత పవర్ ఫుల్ రోల్స్ చేస్తారో.. ఈ టాక్ షోలో అంత జోవియల్ గా ఉంటారు. సరదా ముచ్చట్లు, నిమిషానికో పంచ్, సెటైర్లు , ఆటపట్టించడం అబ్బో బాలయ్యతో ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు. తాజాగా అన్ స్టాపబుల్ షోకు విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు. తన జనరేషన్ హీరో కావడంతో ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు ఈ ఇద్దరు స్టార్ హీరోలు. అలాగే వీరి మధ్య ఎన్నో సరదా సంభాషణలు జరిగాయి.

ఈ క్రేజీ ఎపిసోడ్ లో బాలయ్య, వెంకీ కలిసి భలే సందడి చేశారు. తన సినిమాల గురించి అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో విషయాలను పంచుకున్నారు వెంకటేష్. బాలకృష్ణ చిలిపి ప్రశ్నలు, వెంకీ మామ ఫన్నీ సమాధానాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే వెంకటేష్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ టాక్ షోలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో వెంకటేష్.. మహేష్ బాబుని పూలకుండీ ఎందుకు తన్నావురా .? అనే సీన్ ప్లే చేసి దాని గురించి అడిగారు బాలయ్య.

దీనికి వెంకటేష్ బదులిస్తూ.. రీసెంట్ గానే మహేష్ కు మెసేజ్ కూడా చేశాను పూలకుండీ ఎందుకు తన్నావు.? అని కానీ రిప్లై ఇవ్వలేదు అని నవ్వుతూ అన్నారు. మహేష్ నా చిన్న తమ్ముడు. మహేష్ అందరికి గౌరవమిస్తాడు. మేమిద్దరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా టైం లో బాగా దగ్గరయ్యాం. నిజమైన అన్న తమ్ముడులానే ఆ సినిమా చేశాం. ఇప్పుడు కూడా ఎప్పుడైనా కలిస్తే నా చిన్న తమ్ముడిలా అనిపిస్తాడు అని అన్నారు వెంకటేష్. అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. సినిమాలకంటే ముందు నుంచే నాకు పవన్ తెలుసు. మా ఇంటికి ఎక్కువ వస్తుండేవాడు. నా దగ్గర లేజర్ డిస్క్ లు ఉండేవి వాటి కోసం ఎక్కువగా వచ్చే వాడు. ఇద్దరం సైలెంట్ గా ఉంటాం.. అలాగే ఇద్దరికీ భక్తి భావం ఎక్కువ.. మేమిద్దరం భక్తి భావంతో కనెక్ట్ అయ్యాం. సైలెంట్ గా ఉంటూనే ఒకరికొకరు అర్ధం చేసుకుంటాం.. అని వెంకటేష్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..