2 సెంచరీలు.. 2 డబుల్ సెంచరీలు.. 8 రోజుల్లో ధోని మాజీ టీంమేట్ ఊచకోత

TV9 Telugu

26 December 2024

ఐపీఎల్ 2025కి ముందు ఢిల్లీ జట్టు రిషబ్ పంత్‌ను విడుదల చేసింది. అదే సమయంలో వేలంలో బిగ్ మ్యాచ్ ఫినిషర్‌గా మారగల 21 ఏళ్ల ఆటగాడిని కొనుగోలు చేశారు.

ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్తరప్రదేశ్ క్రికెటర్ సమీర్ రిజ్వీని రూ.95 లక్షలకు కొనుగోలు చేసింది. అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో అతని బ్యాట్ చాలా బాగా రాణిస్తోంది.

గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగమైన రిజ్వీ.. వచ్చే ఏడాది ఢిల్లీ తరపున ఆడనున్నాడు. చెన్నై తరపున ఘోరంగా విఫలమవ్వడంతో, ధోని ఈ ఆటగాడిని వదులుకున్నాడు.

అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో సమీర్ రిజ్వీ గత 8 రోజుల్లో 2 సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్ సెన్సేషన్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

డిసెంబర్ 21న త్రిపురపై సమీర్ రిజ్వీ 97 బంతుల్లో 201 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు విదర్భపై 105 బంతుల్లో 202 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అంతకుముందు సమీర్ రిజ్వీ హిమాచల్ ప్రదేశ్‌పై 153 పరుగులు, పాండిచ్చేరిపై 137 నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పరుగుల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తున్నాడు.

ఈ టోర్నీలో సమీర్ రిజ్వీ ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడి 242.67 సగటుతో 728 పరుగులు చేశాడు. అతను 172.51 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు.

సమీర్ రిజ్వీ ఐపీఎల్ కెరీర్ 2024లో ప్రారంభమైంది. కానీ అతను 8 మ్యాచ్‌ల్లో 51 పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత CSK టీమ్ అతన్ని విడుదల చేసింది.