AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidamuyarchi: ఆకట్టుకుంటున్న అజిత్ లేటెస్ట్ మూవీ ‘విడాముయర్చి’ లిరిక‌ల్ సాంగ్

తమిళ్ స్టార్ హీరో అజిత్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక తమిళనాట ఆయన క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. అజిత్ ప్రస్తుతం విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల్లో నటిస్తున్నారు.

Vidamuyarchi: ఆకట్టుకుంటున్న అజిత్ లేటెస్ట్ మూవీ ‘విడాముయర్చి’ లిరిక‌ల్ సాంగ్
Vidaamuyarchi
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2024 | 8:36 AM

Share

అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. ఈ సినిమా వ‌చ్చే 2025 సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన విడాముయ‌ర్చి సినిమా టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ ల‌వెల్‌కు తీసుకెళుతూ మేక‌ర్స్ ఈ మూవీ నుంచి ‘స‌వదీక‌’ అనే ఫాస్ట్ బీట్ ఎన‌ర్జిటిక్ సాంగ్‌ను మేక‌ర్స్ శుక్ర‌వారం రోజున విడుద‌ల చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద‌ర్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన త‌న‌దైన శైలిలో మ‌రో సూప‌ర్బ్ ట్యూన్‌తో స‌వ‌దీక సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఆంథోని దాస‌న్ పాడిన ఈ పాట‌ను అరివు రాశారు.

స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను, వైవిధ్య‌మైన చిత్రాల‌తో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ సినిమాల‌ను నిర్మిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్ నేతృత్వంలో సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సండ్ర‌, నిఖిల్ నాయ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.

కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతాన్నిఅందిస్తుండ‌గా ఓం ప్ర‌కాష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎన్‌.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. అజిత్ కుమార్ ‘విడాముయ‌ర్చి’ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? మార్క్ షీట్
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? మార్క్ షీట్
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంతకు తెగించావ్‌రా.. పాపం ఆ సాఫ్ట్‌వేర్..
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంతకు తెగించావ్‌రా.. పాపం ఆ సాఫ్ట్‌వేర్..