KL Rahul: చాలా మంచి పనిచేశావయ్యా రాహుల్.. పేద విద్యార్థి చదువుకు ఆర్థిక సాయం చేసిన టీమిండియా క్రికెటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ విద్యార్థికి ఆర్థిక సాయం చేసి తన మానవత్వం చాటుకున్నారు. మహాలింగాపూర్‌కు చెందిన అమృతన్ మావింకట్టి అనే విద్యార్థి ఇటీవల పీయూసీ కామర్స్ పరీక్షా ఫలితాల్లో 600 మార్కులకు 571 మార్కులు సాధించాడు. ఉన్నత చదువుల కోసం హుబ్బళ్లిలోని KLE ఇన్‌స్టిట్యూట్‌లో CA కోచింగ్ అడ్మిషన్ కోసం వెళ్లాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ విద్యార్థికి ఆర్థిక సాయం చేసి తన మానవత్వం చాటుకున్నారు. మహాలింగాపూర్‌కు చెందిన అమృతన్ మావింకట్టి అనే విద్యార్థి ఇటీవల పీయూసీ కామర్స్ పరీక్షా ఫలితాల్లో 600 మార్కులకు 571 మార్కులు సాధించాడు. ఉన్నత చదువుల కోసం హుబ్బళ్లిలోని KLE ఇన్‌స్టిట్యూట్‌లో CA కోచింగ్ అడ్మిషన్ కోసం వెళ్లాడు. అయితే అందులో అడ్మిషన్ దక్కాలంటే కళాశాల యాజమాన్య బోర్డు రూ.85 వేలు ఫీజు చెల్లించాలని తెలిపింది. ఒకవేళ మంచి మార్కులు వస్తే రూ.10 వేలు రాయితీ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అయితే మావింకట్టికి మంచి మార్కులు రావడంతో 10 వేలు రాయితీ కింద పోగా వారు 75 వేలు చెల్లించాల్సి వచ్చింది. అయితే అమృతన్ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు. CA కోచింగ్ అడ్మిషన్ కోసం కేవలం 25వేలు మాత్రమే సర్దుబాటు అయ్యాయి. దీంతో మిగిలిన 50వేల కోసం చాలా చోట్ల అప్పు అడిగారు. అయితే అమృతన్ గురించి స్థానికంగా నివాసముంటోన్న మంజునాథ్ హెబ్సూర్ అనే సామాజిక కార్యకర్తకు తెలిసింది. అతను ముంబైలో అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీని నిర్వహించే అక్షయ్ అనే తన స్నేహితుడికి ఈ విషయాన్ని చేరవేశాడు. అక్షయ్ కు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలతో పరిచయం ఉంది.
అమృతన్ దీన పరిస్థితిని తెలుసుకున్న అక్షయ్ వెంటనే కేఎల్ రాహుల్‌కు ఫొన్ చేశాడు. సదరు ట్యాలెంటెడ్ స్టూడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. దీనికి స్పందించిన టీమిండియా క్రికెటర్ అమృతన్ కాలేజీ ఫీజు అంతా తానే చెల్లిస్తానంటూ ముందుకొచ్చాడు. వెంటనే సదరు విద్యార్థి వివరాలను తెలుసుకున్నాడు. ఆ వెంటనే కాలేజీ ఫీజుతో పాటు విద్యార్థికి అవసరమైన వసతి, బుక్స్‌కు అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తానన్నాడు. ఈ సందర్భంగా తనకు అన్ని విధాలా సహకరించిన KL రాహుల్, అక్షయ్, మంజు హెబ్సూర్‌లకు ధన్యవాదాలు తెలిపాడు అమృతన్. కాగా గాయం కారణంగా ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అయితే తన ఉదారత గురించి తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..