WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఓటమి ఎఫెక్ట్‌.. ఈ టీమిండియా క్రికెటర్ల కెరీర్‌ ఖేల్‌ ఖతం!!

ప్రతిష్ఠత్మక ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసింది. లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో పేలవ బ్యాటింగ్‌తో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఓటమి ఎఫెక్ట్‌.. ఈ టీమిండియా క్రికెటర్ల కెరీర్‌ ఖేల్‌ ఖతం!!
Team India
Follow us
Basha Shek

|

Updated on: Jun 12, 2023 | 1:43 PM

ప్రతిష్ఠత్మక ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసింది. లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో పేలవ బ్యాటింగ్‌తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 209 పరుగులతో పరాజయం పాలై వరుసగా రెండో డబ్ల్యూటీసీ గదను చేజార్చుకుంది. మ్యాచ్‌ ఆద్యంతం దూకుడుగా ఆడిన ప్రత్యర్థి ఆఖరి రోజూ విజృంభించి WTC టైటిల్ రెండో ఎడిషన్‌ను కైవసం చేసుకుంది. దీంతో పదేళ్ల తర్వాతనైనా ఐసీసీ కప్‌ కొట్టాలన్న టీమిండియా కల నెరవేరలేదు. చివరి రోజు భారత్ విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియాకు 7 వికెట్లు అవసరం. అయితే తొలి సెషన్‌లోనే విజృంభించిన ఆసీస్ బౌలర్లు భారత్‌ను ఆలౌట్‌ చేసి డబ్ల్యూటీసీ గదను కైవసం చేసుకున్నారు. కాగా టీమ్ ఇండియా ఇప్పుడు యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తోంది. ఇక టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ ఈ తంతు కొనసాగనుంది. ఈ క్రమంలో టెస్ట్ ఛాంపియన్‌షిప్ ముగియడంతో త్వరలోనే కొందరు టీమిండియా క్రికెటర్లు టెస్ట్‌ ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నారని తెలుస్తుంది.

సాహా టు ఉమేశ్‌..

ఎంఎస్ ధోని టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత వృద్ధిమాన్ సాహా ప్రధాన వికెట్ కీపర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే రిషబ్ పంత్ జట్టులోకి వచ్చి సాహాను రీప్లేస్‌ చేశాడు. ఇప్పుడు కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ కూడా ఉన్నారు. దీంతో సాహా జట్టులోకి రావడం ఇక గగనమే. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్ తో పాటు మరికొందరు యువ పేసర్లు టీమిండియాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఇషాంత్ జట్టులోకి పునరాగమనం అనుమానమే. కాబట్టి త్వరలోనే అతను కూడా గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. ఇక మార్చి 2022 తర్వాత మయాంక్‌ అగర్వాల్ ఏ టెస్టు మ్యాచ్‌కి ఎంపిక కాలేదు. టీమ్ ఇండియాలో ఓపెనర్ల స్థానం కోసం శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ క్రికెటర్లు పోటీపడుతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మయాంక్ కు చోటు దక్కడం అనుమానమే. ఇక టీమిండియా మరో స్పీడ్‌స్టర్ ఉమేష్ యాదవ్ టెస్ట్ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కాబట్టి ఉమేశ్‌కి కి కూడా జట్టులో చోటు అనుమానమే. వీరితో పాటు రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్, జయంత్ యాదవ్‌, ఉనాద్కత్‌ తదితర క్రికెటర్లను కూడా ఇక వైట్‌ జెర్సీలో చూడలేకపోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..