WTC: డబ్ల్యూటీసీ 2023-25 షెడ్యూల్.. టీమిండియా ఎన్ని టెస్టులు ఆడనుందంటే.?

డబ్ల్యూటీసీ 2021-23 ముగిసింది. జూన్ 7-11 వరకు జరిగిన ఈ సిరీస్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ఫోకస్ డబ్ల్యూటీసీ 2023-25కి షిఫ్ట్ అయింది.

WTC: డబ్ల్యూటీసీ 2023-25 షెడ్యూల్.. టీమిండియా ఎన్ని టెస్టులు ఆడనుందంటే.?
Team India
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 12, 2023 | 11:56 AM

డబ్ల్యూటీసీ 2021-23 ముగిసింది. జూన్ 7-11 వరకు జరిగిన ఈ సిరీస్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ఫోకస్ డబ్ల్యూటీసీ 2023-25కి షిఫ్ట్ అయింది. జూన్ 16 – జూలై 31 మధ్య జరగబోయే యాషెస్ సిరీస్‌తో డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ ప్రారంభం కానుందని ఐసీసీ పేర్కొంది. రెండేళ్ల పాటు సాగే ఈ మూడో టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 27 సిరీస్‌ల్లో 68 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇందులో మొత్తంగా టీమిండియా 20 టెస్టులు ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో 5 టెస్టులు, బంగ్లాదేశ్‌తో 2 టెస్టులు, న్యూజిలాండ్‌తో 3 టెస్టులు ఆడనుంది. ఇక విదేశాల్లో వెస్టిండీస్‌తో 2 టెస్టులు, దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు తలబడనుంది. రాబోయే రెండేళ్లలో డబ్ల్యూటీసీ సీజన్‌లో ఇంగ్లాండ్ అత్యధికంగా 22 మ్యాచ్‌లు ఆడనుండగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా(21), భారత్(20) ఆడనున్నాయి. ఈ ఎడిషన్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ జట్టు.. ఆస్ట్రేలియా పర్యటిస్తుంది. కాగా, డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో ఆడబోయే 9 జట్లు ప్రతి సిరీస్‌లోనూ 2 నుంచి 5 టెస్టులు ఆడతాయి.