కేవలం 6 బంతులే.. మ్యాచ్ మలుపు తిప్పి.. టీమిండియాను దెబ్బకొట్టిన ధోని శిష్యుడు.. ఎవరంటే?

విజయానికి కావాల్సింది 280 పరుగులు.. చేతిలో ఉన్నది 7 వికెట్లు.. బరిలో కోహ్లీ, రహనే. టీమిండియా కచ్చితంగా ట్రోఫీ కొడుతుందని అందరూ భావించారు. కానీ ఒకే ఒక్క ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మలుపు తిప్పేసింది.

కేవలం 6 బంతులే.. మ్యాచ్ మలుపు తిప్పి..  టీమిండియాను దెబ్బకొట్టిన ధోని శిష్యుడు.. ఎవరంటే?
Ind Vs Aus
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 12, 2023 | 10:15 AM

చివరి రోజు.. విజయానికి కావాల్సింది 280 పరుగులు.. చేతిలో ఉన్నది 7 వికెట్లు.. బరిలో కోహ్లీ, రహనే. టీమిండియా కచ్చితంగా ట్రోఫీ కొడుతుందని అందరూ భావించారు. కానీ ఒకే ఒక్క ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మలుపు తిప్పేసింది. ఇద్దరు భారత కీ బ్యాటర్లు ఔట్ అయ్యారు. ఇంతకీ ఆ ఓవర్ వేసింది కూడా మరెవరో కాదు.. ధోని శిష్యుడు. అతడి స్పెల్ భారత్‌కు ట్రోఫీ అందనివ్వకుండా చేసింది. అతడు మరెవరో కాదు స్కాట్ బొలాండ్.

టెస్టుల్లోకి అరంగేట్రం చేసి రెండేళ్లు అవుతున్నప్పటికీ.. ఈ 34 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేసర్‌కు తక్కువగానే అవకాశాలు దక్కాయి. అయితేనేం తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించి.. తన కెరీర్‌లోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్(6/7) నమోదు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. ఆస్ట్రేలియా పేస్ ఎటాక్‌లో కీలక పేసర్‌గా మారాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ ఐదో రోజులో స్కాట్ బొలాండ్ ఒక్క ఓవర్ మ్యాచ్ భారత్ చేతికి దక్కకుండా చేసింది. ఆ ఓవర్ రెండో బంతికి మంచి ఊపు మీదున్న విరాట్ కోహ్లీ(49)ని పెవిలియన్ చేర్చిన బొలాండ్.. ఐదో బంతికి జడేజా(0)ను డకౌట్‌ చేశాడు. ఇక అక్కడ నుంచి టీమిండియా కోలుకోలేకపోయింది. కొద్దిసేపు రహనే(46), భరత్(23) ప్రయత్నించినప్పటికీ.. చివరికి పరాజయం పాలైంది. అంతేకాదు.. అటు ఫస్ట్ ఇన్నింగ్స్, ఇటు సెకండ్ ఇన్నింగ్స్‌లలోనూ బొలాండ్.. శుభ్‌మాన్ గిల్ వికెట్లను పడగొట్టిన సంగతి తెలిసిందే.

ధోని సారధ్యంలో ఐపీఎల్..

స్కాట్ బొలాండ్.. ఐపీఎల్‌లో ఆడాడు. ఇది చాలామందికి తెలియదు. ధోని, స్టీవ్ స్మిత్‌లతో అతడు 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కి ప్రాతినిధ్యం వహించాడు. అతడు ఆడిన 2 మ్యాచ్‌ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. అయితేనేం క్రికెట్‌లో ఓనమాలు మాత్రం మిస్టర్ కూల్ ధోని దగ్గర నేర్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆడిన 8 అంతర్జాతీయ టెస్టుల్లో.. 33 వికెట్లు పడగొట్టి.. మరో నాలుగు రోజుల్లో జరగబోయే యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌లో కీలకంగా మారనున్నాడు.

Scott Boland

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..